భారతదేశంలో రెండు ప్రధానమైన ఆహారాలు ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో రోటి అయితే దక్షిణ భారతదేశంలో అన్నం. ఎలాంటి కూరలు వండుకున్నా ఎలాంటి వంటలు చేసినా తప్పకుండా ఈ రెండు మాత్రం తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. బహుశా రోటి లేదా అన్నం వండని రోజు అంటూ ఉండదేమో. ఉత్తర భారత దేశంలో ఎక్కువగా గోధుమలను పండిస్తారు.. అందుకే ఆ ప్రాంత ప్రజలంతా గోధుమలతో తయారయ్యే రొట్టెలను తమ ఆహారంలో భాగం చేసుకున్నారు. ఇక దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి పంట పండుతుంది. అందుకే దక్షిణ భారతదేశంలో ప్రజలంతా బియ్యాన్ని తమ ఆహారంలో భాగం చేసుకున్నారు.
ఒక డాక్టరు ఒక వ్యక్తికి కూరగాయలను బాగా తీసుకోమని సలహా ఇచ్చాడు అని అనుకుందాం.. ఆ వ్యక్తి కనుక ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి అయితే అతను కూరగాయలతో చేసిన పదార్థాన్ని రొట్టెతో తింటాడు.. అదే వ్యక్తి దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి అయితే కూరగాయలతో చేసిన వంటని అన్నంలో కలుపుకొని తింటాడు. అంటే ఏం తిన్నా ఎలా తిన్నా రొట్టె లేదా అన్నాన్ని మాత్రం మన భారతీయుల నుండి వేరు చేయలేం. ఈ ఒక్క విధానమే రకరకాల వ్యాధులకు మూల కారణం అవుతుంది.
గోధుమలలో అలాగే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ చాలా అధికంగా ఉంటాయి, పాట్స్ కూడా అధికంగా ఉంటాయి. మనం డైటీషియన్ల నోటి నుండి లేదా డాక్టర్ల నోటి నుండి గ్లైకమిక్ ఇండెక్స్ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఈ గ్లైకమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి అని చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం జీర్ణం అయ్యాక ప్రతిది చక్కెరగా మారి రక్తం లో కలుస్తుంది. మీరు చక్కెర తిన్న అది చక్కెర గానే మారుతుంది.మిరు కారం తిన్న అది మళ్ళీ చక్కెరగానే మారి రక్తం లో కలుస్తుంది.ఈ గ్లైకమిక్ ఇండెక్స్ అనేది ఒక కొలత లాంటిది. ఏ ఆహారం ఎంత సమయంలో చక్కెరని రక్తంలో విడుదల చేస్తుందో ఆ కొలతని గ్లైకోమిక్ ఇండెక్స్ అంటారు. అంటే ఒక్కో ఆహార పదార్థం జీర్ణం అవ్వడానికి వేరువేరు సమయాలు పడుతాయి. బియ్యం లేదా గోధుమలతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలోకి చక్కెర చాలా త్వరగా మరియు వేగంగా విడుదలవుతుంది. కనుక వీటి గ్లైకమిక్ ఇండెక్స్ చాలా అధికంగా ఉంటుంది. ఈ గ్లైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ త్వరగా వస్తుంది. డయాబెటిస్తో రకరకాల వ్యాధులు కూడా వస్తాయి. కనుక ఈ బియ్యానికి అలాగే గోధుమలతో తయారు చేసిన పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. మరి ఎలాంటి పదార్థాలను తీసుకోవాలి.
చాలా ఉన్నాయి, చిరుధాన్యాలను ఆహారములో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు వీటిని మనం గోధుమలకు అలాగే బియ్యానికి బదులుగా కూడా వాడుకోవచ్చు. వీటిలో గ్లైకమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకు రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
కొర్రలు: చిరుధాన్యాలలో ముఖ్యమైనవి కొర్రలు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి,వీటి ద్వారా మనకు వైటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. అందులోనూ ఈ కొర్రలను ఆహారంగా తీసుకున్న వారికి విటమిన్ బి12 లోపం కూడా ఉండదు. నేడు విటమిన్ బి-12 లోపంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, విటమిన్ బి12 లోపం ఆల్జీమర్స కి కూడా దారితీస్తుంది. ఈ కొర్రలను బియ్యంలానే వాడుకోవచ్చు. వీటిని దాదాపు 6 గంటలు నానబెట్టాల్సి ఉంటుంది. నానిన తరువాత వాటిని బియ్యాన్ని ఎలా వండుకుంటామో అలానే వండుకోవాల్సి ఉంటుంది. వీటిని మనం ప్రతిరోజు తయారు చేసుకునే కూరల తో తినవచ్చు
అండు కొర్రలు: అండు కొర్రల ద్వారా కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ఈ అండు కొర్రలలో విటమిన్ బి త్రీ పుష్కలంగా లభిస్తుంది, దీని కారణంగా శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతూ ఉన్నవారు ఈ అండు కొర్రలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చక్కెర వ్యాధి కూడా పూర్తిగా తగ్గుతుంది. ఈ అండు కొర్రలను కూడా రాత్రంతా లేదా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వీటిని కూడా బియ్యాన్ని వండుకున్నట్టే వండుకోవచ్చు.
సామలు:ఈ సామలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా లభిస్తుంది. అన్ని చిరుధాన్యాల లాగానే వీటిలో కూడా రకరకాల మినరల్స్ మరియు శరీరానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి. వీటిని కూడా దాదాపు 5 నుండి 6 గంటల సేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పై వీటిని కుడా బియ్యం లానే వండుకోవచ్చు
అరికెలు: ఆడవారికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. పి సి ఓ డి, పి సి ఓ ఎస్ గర్భసంచి సమస్యలు ఇలా చాలా ఉంటాయి. ఆడవారు అరికెలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఈ అరికెలను కూడా నానబెట్టి వండుకోవాల్సి ఉంటుంది.
ఊదలు:ఊదలలో కూడా ఫైబర్ అలాగే ప్రోటీన్ బాగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకున్న అధిక రక్తపోటుని తగ్గించుకోవాలి అనుకున్నా ఊదలను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని కూడా దాదాపు 6 నుండి ఏడు గంటల వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆపై వీటిని కూడా బియ్యంలాగా వండుకోవచ్చు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నానబెట్టిన నీటిని వండుకోవడానికి వాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే కొన్ని గంటల పాటు ఈ చిరుధాన్యాలు నీటిలో ఉంటాయో ఈ చిరుధాన్యాలలో ఉన్న ఫైబర్ అంతా ఆ నీటిలో చేరుతుంది. ఆ నీటిని కనుక పారబోసినట్లయితే చిరుధాన్యాలు తిన్నా సరే ఎలాంటి ఉపయోగం ఉండదు. కనుక ఏ నీటితో అయితే నాన పెట్టుకుంటాము ఆ నీటిని తప్పకుండా వాడుకోవాలి.
© 2023 - 2024 Millets News. All rights reserved.