Why Millets News

ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని ప్రోత్సహించే జాతీయ స్థాయి మీడియా పోర్టల్

By Srinivas Sarakadam, Founder

Millets News ఎందుకు?

డిజిటల్ మార్కెటర్ మరియు వ్యాపార మార్గదర్శకుడిగా, Dr. Reddy’s, Horlicks, Loreal వంటి పేరుగాంచిన బ్రాండ్స్‌తో పని చేసిన అనుభవంతో, మిల్లెట్స్ లోని పోషక గుణాలు తెలుసుకొని, వాటి ఆరోగ్య ప్రయోజనాలను భారతీయులందరికీ చేరవేయాలనిపించింది.

అందుకే www.millets.news అనే ప్లాట్ ఫార్మ్ ను స్థాపించాము. ప్రస్తుతం ఈ పోర్టల్ ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విస్తరించనున్నాము.

డాక్టర్ కన్సల్టేషన్ సేవలు

మా మాధ్యమంలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన సేవలలో ఒకటి డాక్టర్ కన్సల్టేషన్. మా నేచురోపతి డాక్టర్లు మరియు న్యూట్రిషనిస్ట్‌లతో ఆన్‌లైన్ వీడియో లేదా టెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. కేవలం రూ.200కి, 20 నిమిషాల కన్సల్టేషన్ అందుబాటులో ఉంటుంది.

HNA కౌన్సిల్ ఏర్పాటు

మిల్లెట్స్ మాత్రమే కాకుండా అన్ని ఆహార పదార్ధాల పోషక గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు, 50 మంది నేచురోపతి, అల్లోపతి మరియు ఆయుర్వేద డాక్టర్లతో కలిసి HNA కౌన్సిల్ ఏర్పాటు చేశాము. ఈ కౌన్సిల్ 20 హెల్త్ మరియు న్యూట్రిషన్ సబ్జెక్టుల మీద ఆన్‌లైన్ శిక్షణ అందజేస్తుంది. పాస్ అయిన వారిని Health and Nutrition Ambassadors (HNA) గా సర్టిఫై చేస్తాం.

భవిష్యత్ ప్రణాళిక

2025 నాటికి 1,000 మంది డాక్టర్లను మరియు 1 లక్ష HNA లతో, ఆరోగ్య పరిజ్ఞానాన్ని సమాజంలో విస్తరించాలన్నదే మా లక్ష్యం. ప్రతి HNA తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు ఆరోగ్యం మరియు పోషకాహారంపై అవగాహన కలిగిస్తారు.

మిల్లెట్స్ గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?

మిల్లెట్స్ సాగు, రెసిపీలు, వ్యాపార ఆలోచనలు, దుకాణాలు, వార్తలు లేదా ఆర్టికల్స్ ఉంటే, వాటిని 9985123485 కి వాట్సాప్ ద్వారా పంపండి లేదా editor@millets.news కి మెయిల్ చేయండి.


© 2023 - 2024 Millets News. All rights reserved.