అధిక దిగుబడి ఇచ్చే చిరుధాన్యాలు.. మిగోరిలో ఆకలిని ఎదుర్కొనడంలో జొన్నల పాత్ర

అధిక దిగుబడి ఇచ్చే చిరుధాన్యాలు.. మిగోరిలో ఆకలిని ఎదుర్కొనడంలో జొన్నల పాత్ర

అధిక దిగుబడి ఇచ్చే చిరుధాన్యాలు.. మిగోరిలో ఆకలిని ఎదుర్కొనడంలో జొన్నల పాత్ర

 

చిరుధాన్యాలపై యావత్ ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో మిల్లెట్స్ పై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మిల్లెట్స్ ను రోజూవారీ ఆహారంగాా తీసుకుంటున్నారు. దేశ, విదేశాల్లో చిరుధాన్యాలను రైతులు సాగు చేస్తుండగా.. మిగోరిలో ప్రజల ఆకలిని తీర్చడంలో మిల్లెట్స్  కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలుస్తోంది.

కెన్యా ప్రజలు ప్రస్తుతం తృణధాన్యాలను, స్వదేశీ ఆహార పదార్థాలను ఇష్టపడుతున్నారని అక్కడి ఆహార నిపుణులు అంటున్నారు. అంతేకాదు మిల్లెట్స్ ను ఈ ప్రాంత ప్రజలు సాగు చేయడంతో పాటు విస్తృతంగా వినియోగిస్తుంటారని తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాల సాగుకు ఆయా ప్రభుత్వాలు అవగాహన కల్పించడమే కాకుండా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే కెన్యా అగ్రికల్చరల్ అండ్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (కేఏఎల్ఆర్ఓ) విత్తనాలను అందించే ప్రాజెక్ట్ ద్వారా అక్కడి రైతులకు కేఏకే - వింబి ఫింగర్ మిల్లెట్ (రాగులు) మరియు ఇకిన్యారుకా జొన్న విత్తనాలను అందించి ప్రోత్సాహాన్ని అందించింది. ఈ క్రమంలోనే మిల్లెట్స్ సాగు చేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని కేఏఎల్ఆర్ఓ తెలిపింది. 

 కురియా పశ్చిమ నియోజకవర్గంలో మిల్లెట్స్ విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా మొక్కజొన్న ప్రజాదరణ కోల్పోగా.. రెండు తృణధాన్యాలను మాత్రం అక్కడి పేద ప్రజలు ఆహారంగా భావించారు. అవే రాగులు మరియు జొన్నలు. వీటి ద్వారా గంజిని తయారు చేసుకోవడం కోసం వారు మిల్లెట్స్ ను సాగు చేసేవారని తెలుస్తోంది. మరి కొందరు ఈ రెండింటిని అంతర పంటగా పండించేవారు. ప్రస్తుతం మిగోరి కౌంటీలో ఈ సాంప్రదాయ పంటలను పునరుద్ధరిస్తున్నారు. అంతేకాదు ఫింగర్ మిల్లెట్, జొన్నలను సాగు చేయడం వలన లాభాలను పొందుతున్నామని రైతులు చెబుతుండటం విశేషం. 

ఆహార భద్రతను కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంచేందుకు మిగోరిలోని అట్టడుగు రైతులకు కేఏఎల్ఆర్ఓ, మిగోరి మరియు కార్నెల్ యూనివర్సిటీ, యూఎస్ కి చెందిన ప్రభుత్వం రాగులు, జొన్న రకాల విత్తనాలను అందించింది. ఈ ధాన్యాలు కేఏఎల్ఆర్ఓ చే ఉత్పత్తి చేయబడ్డాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, నీటి సరఫరా లేకపోయినా అదేవిధంగా నీరు నిండిన నేలలో సాగు చేసినప్పటికీ ఈ పంటలకు నష్టం వాటిల్లదు. దీంతో కెన్యా ప్రజలు మిల్లెట్స్ ను పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా రాగులు, జొన్నలకు గిరాకీ పెరిగింది.

స్వదేశీ పంటలలో మెరుగైన రకాలను పెంచడం ద్వారా ఆకలితో పోరాడటంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటుగా మెరుగైన విత్తన సాంకేతికత నేపథ్యంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం వంటి వాటిపై చేసే పోరాటంలో మిల్లెట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.