Andhra Pradesh: 1200 మంది మహిళా రైతులతో మిల్లెట్స్ సాగు, అద్భుతమైన లాభాలు సాధిస్తున్న రైతులు.

Andhra Pradesh: 1200 మంది మహిళా రైతులతో మిల్లెట్స్ సాగు, అద్భుతమైన లాభాలు సాధిస్తున్న రైతులు.

Andhra Pradesh: 1200 మంది మహిళా రైతులతో మిల్లెట్స్ సాగు, అద్భుతమైన లాభాలు సాధిస్తున్న రైతులు.

 

Andhra Pradesh : సాధారణంగా ఆంధ్రప్రదేశ్ వరి ఎక్కువగా పండించే రాష్ట్రం. అయితే విజయనగరం జిల్లాలోని నలభై గ్రామాల్లో 1200 మంది మహిళా రైతులు మిల్లెట్స్ పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆరోగ్య మిల్లెట్స్ సంస్థలో వీరు భాగస్తులు గా ఉన్నారు. ఈ సంస్థ సీఈఓ గా కె.సరస్వతి గారు వ్యవహరిస్తున్నారు. 

ఆరోగ్య మిల్లెట్స్ సంస్థ ప్రారంభించిన కొత్తలో పరిస్థితులు అనుకూలంగా లేవు, 2006-07 సంవత్సరాలలో సాంప్రదాయక పంటలకు బదులుగా మిల్లెట్స్ సాగు చాలా కష్టపడాల్సి వచ్చింది అని ఆమె అన్నారు. 200 ఎకరాల్లో మహిళా రైతుల ద్వారా మిల్లెట్స్ సాగును ప్రారంభించినట్లు దీనికోసం మహిళా రైతులకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా వడ్డీ లేని రుణాలను అందించాం అని అన్నారు. 

ప్రస్తుతం మిల్లెట్స్ ప్రాసెసింగ్ కోసం , ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 4 కోట్ల రూపాయలతో ఒక కొత్త మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ను విజయనగరం జిల్లాలోని రేగా గ్రామంలో ఏర్పాటు చేసింది. దీంతో మిల్లెట్స్ సాగు చేస్తున్న రైతులకు మరింత ప్రోత్సాహం లభించింది. విజయనగరం జిల్లాలో మిల్లెట్స్ సాగు ప్రారంభించిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 20 సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చాయి అని సరస్వతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ మహిళా రైతులు పండించిన మిల్లెట్స్, ప్రాసెసింగ్ చేసిన మిల్లెట్ పౌడర్, మిల్లెట్ బిస్కెట్లు, మిల్లెట్ బెకరీ ఐటమ్స్, మిల్లెట్ పాస్తా, మిల్లెట్ ఫ్లేక్స్, మిల్లెట్ నూడిల్స్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా మిగతా రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా మిల్లెట్ సాగు చేస్తున్న మహిళా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు అని ఆరోగ్య మిల్లెట్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్ పర్సన్ ఉషారాణి తెలిపారు. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.