వీటిలో ఉండే పోషక విలువలు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి అని ప్రచారం చేసింది. తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా తన బ్లాగ్ లో మిల్లెట్స్ గురించి ప్రస్తావించారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో మిల్లెట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
“మిల్లెట్స్ వందల సంవత్సరాలుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటి ఉపయోగం మళ్ళీ పెరుగుతుంది,, వినియోగదారుల నుండి డిమాండ్ తో పాటుగా వీటిని పండించే రైతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది” అని బిల్ గేట్స్ తన బ్లాగ్ లో రాసారు.
అంతే కాకుండా “యూరోపియన్లు మొదట వెస్ట్ ఆఫ్రికా ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఫోనియో ను “హంగ్రీ రైస్ “ అని పిలిచేవారు. దీనికి కారణం ఇవి చాలా తక్కువ సమయంలో పండుతాయి. ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో లేని సమయంలో వీటిని త్వరగా పండించవచ్చు, ప్రస్తుతం వీటిని చాలా మంది ప్రజలు సూపర్ ఫుడ్ అని పిలుస్తున్నారు” అని వివరించారు.
హైదరాబాద్ లో నటి రకుల్ ప్రీత్ సింగ్ మిల్లెట్స్ రెస్టారెంట్ ''ఆరంభం''..!
“ఫొనియో ను పండించడం అంటే వ్యవసాయం సులభతరం చేసినట్టే, వర్షం పడినప్పుడు భూమిని దున్ని విత్తనాలు నాటడం, రెండు నెలల తర్వాత పంట చేతికి రావడం ఇంతే. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు మిల్లెట్స్ ను పండించడం భవిష్యత్తులో చాలా ముఖ్యమైనది గా మారుతుంది” అని కూడా బిల్ గెట్స్ తన బ్లాగ్ లో రాసారు.
ఇంకా వివరంగా “ ఫోనియో అంటే పురాతన కాలంలో చిరు ధాన్యాల కుటుంబం , అందులో భాగమే మిల్లెట్స్. మీరు ఫింగర్ మిల్లెట్స్ గురించి వినే ఉండవచ్చు ఉగాండా, కెన్యా , టాంజానియా దేశాల్లో ఇది చాలా ముఖ్యమైంది. భారతదేశంలో వీటిని రాగులు అని పిలుస్తారు” అని భారతదేశం గురించి కూడా బిల్ గేట్స్ ప్రస్తావించారు.
మిల్లెట్స్ పట్ల తాను చాలా ఆకర్షితుడిని అయ్యాను అని, పోషకాహార లోపం ఉన్న దేశాలు వీటిని ఆహారంగా తీసుకోవాలని బిల్ గేట్స్ అన్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.