ఒడిశా వ్యవసాయ వారసత్వాన్ని స్మరించుకుంటూ: మిల్లెట్స్ మరియు మరచి పోయిన ఆహారాలపై అంతర్జాతీయ సదస్సు

ఒడిశా వ్యవసాయ వారసత్వాన్ని స్మరించుకుంటూ: మిల్లెట్స్ మరియు మరచి పోయిన ఆహారాలపై అంతర్జాతీయ సదస్సు

ఒడిశా వ్యవసాయ వారసత్వాన్ని స్మరించుకుంటూ: మిల్లెట్స్ మరియు మరచి పోయిన ఆహారాలపై అంతర్జాతీయ సదస్సు

 

 

భువనేశ్వర్: వ్యవసాయ శాఖ ఈ నవంబర్ 10, 11 తేదీల్లో లోక్ సేవా భవన్‌లో శ్రీ అన్నా మరియు మరచి పోయిన ఆహారాలు (ISSFF)పై అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. "శ్రీ అన్నా మరియు ఒడిశా వ్యవసాయ వారసత్వం" అనే థీమ్‌తో, ఈ సదస్సు ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం కోసం మిల్లెట్స్ మరియు మరచి పోయిన పంటల ప్రాముఖ్యతను ప్రధానంగా చర్చించనుంది.

 

ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జಿ ఈ సదస్సును ప్రారంభిస్తారు.ఇక్కడ ప్రదర్శనలో భాగంగా,పంటలు మరియు స్థానిక ఆహారాలు క్లైమేట్ మార్పుల వల్ల ఏర్పడే ప్రతికూలతలను ఎదుర్కొనడంలో కీలకంగా మారతాయని,అంతేకాకుండా పోషకాహారాన్ని మెరుగుపరచడానికి వీటివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చర్చిస్తారు. ఈ పంటలు ఒడిశా వాతావరణానికి అనుకూలంగా పెరుగుతాయి, తక్కువ వనరులతో, స్థానిక సంప్రదాయాలకు అనుసంధానంగా ఉంటాయి.

 

ఉప ముఖ్యమంత్రి కె.వి.సింగ్ దేవ్ మీడియా సమావేశంలో "మన ఆహారంలో మిల్లెట్స్ మరియు మరచి పోయిన పంటలను చేర్చుకోవడం ద్వారా ఒడిశా వ్యవసాయ వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటు మన ఆరోగ్యాన్నిమెరుగుపరచవచ్చు" అని చెప్పారు.

ISSFF 2024 వివిధ వర్గాల వనరులను ఒకే వేదికపైకి తీసుకురానుంది. వీటిలో మహిళల స్వయం సహాయక సంఘాలు (WSHGs), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs), పాలసీ మేకర్లు, MSMEs, ఆరోగ్య సంస్థలు, చెఫ్ సంఘాలు, బ్లాగర్లు, విద్యార్థులు మరియు ఇతర సంస్థలు ఉన్నాయి. వీరంతా కలిసి ఈ  పంటల ప్రాధాన్యత మరియు వాటి మార్కెట్ అవకాశాలను ప్రోత్సహించేందుకు పథకాలు సిద్ధం చేస్తారు.

 

ఈ సదస్సులో మిల్లెట్స్ సాగు, ప్రాసెసింగ్, ఎగుమతి అవకాశాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల పై 11 సెషన్స్ ఉంటాయి. పైగా 9 స్టాళ్లలో ఈ పంటలలోని వివిధ రకాల ప్రదర్శనలు ఉంటాయి.

 

ఉత్తమ మిల్లెట్స్ రైతు,ఉత్తమ స్వయం సహాయక సంఘం,రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవార్డులను అందజేస్తారు.ఒడిశా పాండిత్యం మరియు సంప్రదాయాలను కాపాడుతున్న మహిళలకు కూడా ప్రత్యేక సత్కారం ఇస్తారు.

 

మిల్లెట్స్ ప్రోత్సాహకంలో ముందంజలో ఉన్న ఒడిశా రాష్ట్రం శ్రీ అన్నా అభియాన్ ద్వారా ప్రేరణను అందించింది. ఈ సదస్సుతో ఒడిశా మరిన్ని ప్రశంసలను పొందే దిశగా అడుగులు వేస్తోంది.

 


© 2023 - 2025 Millets News. All rights reserved.