ఖరీఫ్ సీజన్‎లో మిల్లెట్స్ సాగు.. రైతులకు రూ.35,000 బదిలీ చేయాలని సూచన

ఖరీఫ్ సీజన్‎లో మిల్లెట్స్ సాగు.. రైతులకు రూ.35,000 బదిలీ చేయాలని సూచన

ఖరీఫ్ సీజన్‎లో మిల్లెట్స్ సాగు.. రైతులకు రూ.35,000 బదిలీ చేయాలని సూచన

 

చిరుధాన్యాలు( మిల్లెట్స్) పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వాటి వాడకం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. మిల్లెట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉండటంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో మిల్లెట్స్ ను ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. మరోవైపు మిల్లెట్స్ సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. 

ఖరీఫ్ సీజన్ లో వరి పంటకు బదులుగా మిల్లెట్స్ , నూనె గింజలు, పప్పుధాన్యాల సాగుకు మారే రైతులకుహెక్టారుకు రూ.35,000 ( ఐదు సంవత్సరాలకు) బదిలీ చేయాలని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సూచించారు. 

పంజాబ్ మరియు హర్యానాలో విభిన్నమైన సాగు ఆవశ్యకతను తెలియజేస్తూ.. ఇందుకోసం అయ్యే ఖర్చును రాష్ట్రానికి, కేంద్రానికి సమానంగా ( 50:50) గా విభజించాలని ప్రతిపాదించింది. అయితే హర్యానా ప్రభుత్వం ఇప్పటికే రైతులకు హెక్టారుకు రూ.17,500 లను అందిస్తోంది. ఈ క్రమంలోనే దాన్ని కేంద్రం రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు. కరెంట్ సరఫరా, నీటి సరఫరా మరియు పంటకు కావాల్సిన ఎరువుల రాయితీలపై పొదుపు చేసి వేరే రూపంలో రైతులకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేయడం వలన పంజాబ్ మరియు హర్యానాలో అత్యంత సారవంతమైన మైదానాలు బీడు బారకుండా భారతదేశం కాపాడగలుగుతుందని పేర్కొంది.

సాగును వరి పంట నుండి పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు మరియు నూనెగింజల పంటలకు మళ్లించే రైతుల కోసం ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ సేకరణకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే పంజాబ్ లోని రైతు సంఘాలకు కేంద్ర మంత్రుల బృందం ప్యాకేజీని అందించిన కొన్ని నెలల తరువాత ఈ పేపర్ బయటకు వచ్చిందని సమాచారం. ‘‘ సేవింగ్ పంజాబ్ అండ్ హర్యానా ఫ్రమ్ ఎకోలాజికల్ డిజాస్టర్’’ అనే పేరుతో ఓ పేపర్ ఈ ప్రకటన ఇచ్చిందని తెలుస్తోంది.ప్రస్తుత పాలన నిలకడగా లేదని, వరి సాగు కోసం భారీ భూగర్భ జలాల వెలికితీతకు ఇది దారితీస్తుందని పేర్కొంది. అదేవిధంగా రెండు ఉత్తరాది రాష్ట్రాలు ఎరువుల సబ్సిడీలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయని నిర్ధారించింది. 

2023-24 సంవత్సరంలో పంజాబ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీలు హెక్టారుకు రూ.38,973గా ఉన్నాయి. ఈ క్రమంలోనే వరి సాగుకు ఆర్థిక సహాయం హెక్టారుకు రూ.40,000 దాటిపోతుంది. దాదాపు మూడింట ఒక వంతుకు సబ్సిడీ రావడంతో వరి పంట నుండి వచ్చే లాభాలు సీజన్ లో పండే ఇతర పంటల కంటే చాలా ఎక్కువ. దీన్ని సజ్జలు (బజ్రా) తో పోలిస్తే.. హెక్టారుకు రూ.68,849 గా ఉంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ మరియు హర్యానాలో వరి సాగు నుండి 12 -14 లక్షల హెక్టార్లను తీసుకోవాలని ప్రతిపాదించింది. అలాగే ప్రభుత్వం అందించే విద్యుత్ సబ్సిడీని తిరిగి పొందడం ద్వారా హెక్టారుకు రూ.30,000 నుండి రూ.40,000 ప్రోత్సాహకంతో పాటు ఎరువుల సబ్సిడీని కూడా కేంద్రం అందించింది. 


© 2023 - 2024 Millets News. All rights reserved.