పెరుగుతున్న మిల్లెట్స్ ధరలు, రైతుల్లో సంతోషం.

పెరుగుతున్న మిల్లెట్స్ ధరలు, రైతుల్లో సంతోషం.

పెరుగుతున్న మిల్లెట్స్ ధరలు, రైతుల్లో సంతోషం.

 

మిల్లెట్స్ వినియోగం బాగా పెరిగింది. చాలామంది ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని మిల్లెట్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. పైగా ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మిల్లెట్స్ వాడకం విపరీతంగా పెరిగింది. చాలా కంపెనీలు, వాళ్ల యొక్క ఆహార పదార్దాల లో మిల్లెట్స్ ని చేరుస్తున్నారు. అయితే అధిక డిమాండ్ మొదలైన కారణాల వలన మిల్లెట్స్ ధరలని పెంచారు. మిల్లెట్స్ ని డైట్లో చేర్చుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. 

మిల్లెట్స్ ని తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలు మొదలు డయాబెటిస్, బీపీ మొదలైన అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే గతవారం విడుదల చేసిన డేటా ప్రకారం చూసినట్లయితే, రాగులు అలానే రాగి ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో 16.6% కి పెరిగింది. ఆరేళ్లలో అత్యధికంగా ఫిబ్రవరిలో 16.7% కి చేరింది.

అనేక ఆహార పరిశ్రమలు రాగులను ఉపయోగించడం వలన డిమాండ్ ఎక్కువైంది. ధరలు కూడా పెరిగాయి అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. 2022-23లో 1.69 మిలియన్ టన్నుల నుండి, 2023 24 లో దాదాపు 1.39 మిలియన్ టన్నులకి రాగుల ప్రొడక్షన్ తగ్గింది. అయితే, ద్రవ్యోల్బణం కారణంగా గత ఏడు నెలల నుండి కూడా రాగుల ఉత్పాదన పెరిగింది. జొన్నలకు కూడా ఇదే పరిస్థితి. మార్చిలో ద్రవ్యోల్బణం స్థాయిలు 10%కి తగ్గినప్పటికీ ద్రవ్యోల్బణం వుంది. 

స్వీట్లు, స్నాక్స్ మొదలైన ఆహార పదార్థాలలో మిల్లెట్స్ ని చేర్చడం వలన ధరలు పెరుగుతున్నాయని ఫిరోజ్ హెచ్ నఖ్వీ, ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్‌కీన్ మాన్యుఫ్యాక్చరర్స్ (FSNM) డైరెక్టర్ చెప్పారు. ITC, టాటా, నెస్లే వంటి కంపెనీలు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ లో సజ్జలు, కొర్రలు (foxtail millets), అరికెలు, సామలు వంటి (little millets) మిల్లెట్స్ ని చేర్చడం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు అని పాఖీ సక్సేనా, రిటైల్ CPG హెడ్ అన్నారు. 


© 2023 - 2024 Millets News. All rights reserved.