రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని Narendra Modi జెరూసలేం నగరంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన విందును ఆస్వాదించారు. ఈ మెనూను భారతీయ మరియు ఇజ్రాయెలీ వంటకాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ విందు ఏర్పాట్లు ప్రముఖ రెస్టారెంటర్ రీనా పుష్కార్ణ (Reena Pushkarna) చేశారు. ఆమెకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ (Pravasi Bharatiya Samman) అవార్డు కూడా లభించింది. గుజరాతీ రుచులతో పాటు ప్రాచుర్యం పొందిన ఇజ్రాయెలీ వంటకాలను కలిపి సమతుల్యమైన మెనూను ఆమె రూపొందించారు. మెనూలో భారతీయ భాగంగా గుజరాత్‌కు ప్రత్యేకమైన మిల్లెట్ వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పెర్ల్ మిల్లెట్, ఇతర చిరు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ తో చేసిన ఈ వంటకాలు తాజాగా తయారు చేసి వడ్డించారు. తద్వారా అసలైన రుచిని నిలబెట్టారు.
అదే సమయంలో ప్రసిద్ధ ఇజ్రాయెలీ వెజిటేరియన్ వంటకాలు కూడా మోదీకి అందించారు. అందులో Hummus, Tahini, Falafel మరియు తాజా లోకల్ సలాడ్లు ఉన్నాయి.
ఈ విందు సిద్ధం చేయడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని రీనా పుష్కర్ణ తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మోదీ ఇజ్రాయెలీ వంటకాలను ఆస్వాదించిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.
ఈ పర్యటనతో భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహం మరింత స్ట్రాంగ్ అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ రెండు దేశాల భాగస్వామ్యం ఇంకా కొత్త స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
© 2023 - 2026 Millets News. All rights reserved.