మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ రూపకల్పనలో 50 మంది డాక్టర్స్ తో ఏర్పాటు అవుతున్న HNA కౌన్సిల్ ను గురువారం, అక్టోబర్ 3 న మీడియా సమావేశం ద్వారా పబ్లిక్ కి పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని HNA కౌన్సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ మోనికా స్రవంతి తెలిపారు
HNA అంటే హెల్త్ అండ్ న్యూట్రీషన్ అంబాసిడర్ అని, వేలాది మంది HNA లను సొసైటీ కి పరిచయం చేసి వారి ద్వారా హెల్త్ అండ్ న్యూట్రీషన్ అంశాలను ప్రతీ కామన్ మాన్ కు చేరేట్టు చూడటమే మా ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.
ఈ క్రింద తెలియజేసిన అంశాలకు ప్రాధాన్యత ను ఇస్తున్నామని ఆమె తెలిపారు
• ప్రతీ ఆహారం, దాని అవసరం అర్థం చేసుకోవటం
• పోషకాహార భోజనం వండే పద్ధతులు
• వివిధ రకాల ఫుడ్ లేబెల్స్, వాటి ప్రత్యేకత
• ప్రాసెస్ ఫుడ్, నిల్వ చేసిన ఫుడ్స్, నష్టాలు
• మనం పర్సనల్ గా బాలన్స్ డైట్ డెవలప్ చేసుకోవటం
• మనం తినే ఫుడ్, పెరిగే బరువు
• మనంతట మనమే న్యూట్రీషన్ లోపాలను పరిష్కరించుకోవ
• మన బాడీ మెటబాలిజం, డైజేషన్ సమస్యలు
• మన బడ్జెట్ లోనే హెల్తీ ఈటింగ్
• ఎటువంటి ఫ్లూయిడ్స్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి
• సప్లిమెంట్స్, విటమిన్స్ ఉపయోగాలు, నష్టాలు
• మన ఫ్యామిలీ మొత్తానికి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్
• దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో మిల్లెట్ల పాత్ర
• మన తీసుకొనే డైలీ ఫుడ్ డైట్ వెంట వెంటనే చేంజ్ చెయ్యటం వలన నష్టాలు
• మన డైలీ డైట్ లో మిల్లెట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు
మిల్లెట్స్ నేషనల్ మీడియా, www.millets.news చైర్మన్ శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ ఈ HNA కౌన్సిల్ లో ఈ సంవత్సరాంతం లోపు కనీసం 1000 మంది నేచురోపతి, ఆయుర్వేద, అల్లోపతి డాక్టర్స్ ను కౌన్సిల్ లో చేర్చుకుంటామని, వచ్చే నెల మేము లాంచ్ చెయ్యబోయే డెడికేటెడ్ HNA పోర్టల్ ద్వారా ఈ మొత్తం కమ్యూనిటీ యొక్క ఆర్టికల్స్, టిప్స్, సలహాలు ఇతరాత్ర అందజేసి HNA సభ్యులుగా జాయిన్ అవ్వబోయే వేలాది మంది గ్రాడ్యుయేట్స్ ని ఎడ్యుకేట్ చేస్తామని అయన అన్నారు.
HNA కౌన్సిల్ లో సభ్యులుగా అవ్వటానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుందని, HNA కౌన్సిల్ డాక్టర్స్ సమూహం ద్వారా వారికి స్పెషల్ 20 సెషన్స్ ట్రైనింగ్ ఉంటుందని అయన అన్నారు. ఆసక్తి ఉన్నవారు www.hnacouncil.com వెబ్సైటు ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన అన్నారు
ఆరోగ్యమైన సమాజం లక్ష్యంగా మా ఈ ప్రణాళిక రూపొందించబడిందని, ఈ 3 నెలలు తెలుగు రాష్ట్రాల్లో గల 1280 మండలంలో ఈ కార్యక్రమం ను ముందుకు తీసుకెళ్లి, వచ్చే సంవత్సరం నుండి ఇతర రాష్ట్రాలకు విస్తరించబోతున్నామని శ్రీనివాస్ తెలిపారు
ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిలజ, డాక్టర్ షేక్ మొహ్మద్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.