మిల్లెట్స్ మరియు ఫుడ్ ప్యూరిటీ ప్రోత్సాహాంలో హోటల్ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ కీలక పాత్ర

మిల్లెట్స్ మరియు ఫుడ్ ప్యూరిటీ ప్రోత్సాహాంలో హోటల్ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ కీలక పాత్ర

మిల్లెట్స్ మరియు ఫుడ్ ప్యూరిటీ ప్రోత్సాహాంలో హోటల్ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ కీలక పాత్ర

 

భారత్ లోని అన్ని రాష్ట్రాలలో చిరుధాన్యాల (మిల్లెట్స్ ) సాగు మరియు వినియోగంపై విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజస్థాన్ రాష్ట్రం మిల్లెట్స్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ తో కలిసి మిల్లెట్స్ ను ప్రోత్సహించడం మరియు ఆహార స్వచ్ఛతను పాటించడంపై హోటల్ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. 

ఆహార భద్రత మరియు మిల్లెట్స్ కు సంబంధించిన అనేక రకాల అంశాలపై చర్చించేందుకు హోటల్ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ (హెచ్ఎఫ్ఆర్) నుంచి ఒక ప్రతినిధి బృందం డిపార్ట్ మెంట్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఇక్బాల్ ఖాన్ (ఐఏఎస్), డైరెక్టర్ పంకజ్ ఓజా, జాయింట్ డైరెక్టర్ ఎస్ఎన్ ధోల్ పురియాతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిల్లెట్స్ పై హెచ్ఎఫ్ఆర్ చేసిన కృషిని డైరెక్టర్ పంకజ్ ఓజా ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చొరవతో మిల్లెట్స్ పై అవగాహన కల్పించడమే కాకుండా ఆహార భద్రత విషయంలో కార్యక్రమాలను చురుకుగా నిర్వహించడంలో డైరెక్టర్ పంకజ్ ఓజాకు తమ పూర్తి మద్ధతు ఇస్తామని హెచ్ఎఫ్ఆర్ అధ్యక్షుడు హుస్సేన్ ఖాన్ తెలిపారు. అదేవిధంగా భవిష్యత్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పర్యాటక రంగంలో వ్యాపారాల కోసం వర్క్ షాప్ లను నిర్వహించాలని హెచ్ఎఫ్ఆర్ భావిస్తోంది. కాగా హెచ్ఎఫ్ఆర్ జారీ చేసిన మిల్లెట్స్ (మినుములు)ను ప్రోత్సహించే పోస్టర్ లను అన్ని శాఖల కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఈ సందర్భంగా డైరెక్టర్ పంకజ్ ఓజా ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు హెచ్ఎఫ్ఆర్ చేపడుతున్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నందుకు గానూ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ ఇక్బాల్ ఖాన్ కూడా ప్రశంసించారు. ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం మరియు పీచు పదార్థం అధికంగా ఉండే మిల్లెట్ల పోషక ప్రయోజానాలను ఆయన వివరించారు. కాగా చిరుధాన్యాలు (మిల్లెట్స్) ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన రక్తపోటును తగ్గించడంలో, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదపడతాయి.

హెచ్ఎఫ్ఆర్ ఉదయపూర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ చౌదరి మాట్లాడుతూ.. బజ్రా, జోవర్, బార్లీ, మొక్కజొన్న, ఉసిరి, సన్వా, బుక్ వీట్, రాగి, కోడో, సామ వంటి మిల్లెట్స్ ప్రసిద్ధి చెందాయన్నారు. అలాగే మిల్లెట్స్ సాగు, ఉత్పత్తిలో రాజస్థాన్ ముఖ్యమైనదని పేర్కొన్నారు. అయితే ఇతర ధాన్యాల కంటే సరమమైన ధరలో లభించడం మరియు మిల్లెట్స్ పై ప్రజలకు అవగాహన పెరగడంతో ప్రజల ఆరోగ్యకరమైన ఆహరంలో భాగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు.

 


© 2023 - 2024 Millets News. All rights reserved.