భారత్ లో 19 శాతం పెరిగిన వరి నాట్లు.. పప్పుధాన్యాల సాగులోనూ పెరుగుదల

భారత్ లో 19 శాతం పెరిగిన వరి నాట్లు.. పప్పుధాన్యాల సాగులోనూ పెరుగుదల

భారత్ లో 19 శాతం పెరిగిన వరి నాట్లు.. పప్పుధాన్యాల సాగులోనూ పెరుగుదల

 

భారత్ లో ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ఖరీఫ్ నాట్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ నెలలో నైరుతి రుతుపవనాల రాకతో వరి నాట్లు ప్రారంభమవుతున్నాయి. తరువాత సెప్టెంబర్ నెల నుంచి వరి కోతలను ప్రారంభిస్తారు. కాగా దేశవ్యాప్తంగా ప్రధాన ఆహార పంటగా ఉన్న ‘వరి’ నాట్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2024-25 ఖరీఫ్ సీజన్ లో సుమారు 19.35 శాతం వరి సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. దీంతో మొత్తం సాగు విస్తీర్ణం 59.99 లక్షల హెక్టార్లకు చేరుకుంది.

మరోవైపు కంది, మినుము పప్పు ధాన్యాల సాగులోనూ గణనీయమైన పెరుగుదల ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత సీజన్ లో వీటి సాగు విస్తీర్ణం జూలై 8వ తేదీ నాటికి సుమారు 36.81 లక్షల హెక్టార్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 23.78 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగింది. గతంతో పోలిస్తే ‘అర్హర్’( కంది) సాగు గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది. అంటే 4.09 లక్షల హెక్టార్ల నుండి 20.82 లక్షల హెక్టార్లకు సాగు విస్తరించింది. అదేవిధంగా మినుముల( ఉరద్) సాగు విస్తీర్ణం కూడా 3.67 లక్షల హెక్టార్ల నుంచి 5.37 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపింది.  

అయితే, ముతక తృణధాన్యాలు మరియు శ్రీ అన్న (మిల్లెట్స్) సాగు విస్తీర్ణం మాత్రం తగ్గిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. వీటి సాగు విస్తీర్ణం 82.08 లక్షల హెక్టార్ల నుండి 58.48 లక్షల హెక్టార్లకు పడిపోయిందని గణాంకాలలో వెల్లడైంది. 

ముతక తృణధాన్యాలలో ఒకటైన ‘మొక్కజొన్న’ సాగు 30.22 లక్షల హెక్టార్ల నుండి 41.09 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇక నూనె గింజల సాగు విస్తీర్ణంలో కూడా పెరుగుదల ఉంది. గత ఏడాది సాగు విస్తీర్ణం 51.97 లక్షల హెక్టార్లుగా ఉండగా.. ఈ ఖరీఫ్ సీజన్ లో సాగు విస్తీర్ణం దాదాపు 80.31 లక్షల హెక్టార్లకు చేరుకుంది. 

ఇక వాణిజ్య పంటల విషయానికి వస్తే.. చెరుకు విస్తీర్ణం 55.45 లక్షల హెక్టార్ల నుండి 56.88 లక్షల హెక్టార్ల వరకు స్వల్పంగా పెరిగింది. పత్తి విస్తీర్ణం 62.34 లక్షల హెక్టార్ల నుండి 80.63 లక్షల హెక్టార్ల వరకు పెరగగా.. జనపనార సాగు విస్తీర్ణం 6.02 లక్షల హెక్టార్ల నుండి 5.63 లక్షల హెక్టార్లకు తగ్గింది. 

మొత్తంగా... అన్ని ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 14 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఉన్న సాగు విస్తీర్ణం 331.90 లక్షల హెక్టార్లు కాగా 14 శాతం  పెరిగి 378.72 లక్షల హెక్టార్లకు చేరుకుంది. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.