భారతదేశంలో చిరుధాన్యాల వాడకం మరియు సాగుపై కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా అవగాహన నిర్వహిస్తూ.. పలు కార్యక్రమాలను చేపడుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మిల్లెట్స్ సాగు జరుగుతోంది. అంతేకాదు ఈ సాగును ప్రోత్సహించేందుకు గానూ గతంలో ‘‘ శ్రీ అన్న యోజన’’ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాల సాగును ఉద్యమంగా మార్చాలని రైతులు భావిస్తున్నారు. అలాగే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రాబోయే బడ్జెట్ లో కేంద్రం నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో మినుముల సాగు విరివిగా సాగుతోంది. రాష్ట్రంలోని పెరంబలూర్, తిరుచ్చి, తంజావూరు, కళ్లకురిచ్చి, అరియలూరు మరియు పుదుక్కోట్టై జిల్లాల్లో రైతులు మిల్లెట్లను పండిస్తున్నారు. సాంబా మరియు తాలడి సాగు అనంతరం బోనస్ పంటలుగా సాగు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ లో ప్రకటన చేస్తే కనుక చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలన్న కేంద్ర బడ్జెట్ ప్రకటనతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయని చెప్పుకోవచ్చు.
అంతేకాదు.. ప్రతి జిల్లాలోనూ కనీసం పది వేల ఎకరాల్లో మిల్లెట్స్ ను రైతులు సాగు చేస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ ( బీకేఎస్) తెలిపిందని సమాచారం. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరైన యంత్రాగాన్ని అందిచాలని పేర్కొంది. అదేవిధంగా రానున్న బడ్జెట్ లో సాగుకు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా సాగు కోసం ప్రత్యేకంగా మద్ధతు పథకం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
రాబోయే పది సంవత్సరాలలో ఈ చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యత ఉంటుందని భారతీయ కిసాన్ సంఘ్ చెబుతోంది. మిల్లెట్స్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలు గుర్తించడంతో పాటు.. కేంద్ర సర్కార్ వీటి సాగును ప్రోత్సహిస్తుండటంతో .. అతి త్వరలోనే ఇది ప్రధానమైన ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా .. పంటను విక్రయించుకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలను కూడా కల్పించాలని కోరారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.