నేపాల్ లో పెరుగుతున్న ‘మిల్లెట్’ దిగుమతులు

నేపాల్ లో పెరుగుతున్న ‘మిల్లెట్’ దిగుమతులు

నేపాల్ లో పెరుగుతున్న ‘మిల్లెట్’ దిగుమతులు

 

వ్యవసాయ దేశంగా నేపాల్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగాయి. ముఖ్యంగా చిరుధాన్యాల దిగుమతుల్లో మరింత పెరుగుదల కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలుస్తోంది. 

నేపాల్ లోని కాకద్ భిట్టా చెక్ పాయింట్ ద్వారా జరిగిన మిల్లెట్స్ దిగుమతి గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తుంది. నేపాల్ 2080/81 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి సుమారు 17,797 టన్నుల చిరుధాన్యాలను దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం రూ.854 మిలియన్లు. అదేవిధంగా 2079/80 ఆర్థిక సంవత్సరంలో రూ.513 మిలియన్ల వ్యయంతో దాదాపు 16,035 మెట్రిక్ టన్నుల నుండి పెరుగుదలను సూచిస్తుంది. 

అయితే, ఇటీవల కాలంలో భారత దేశం మరియు ఇతర దేశాల నుంచి చిరుధాన్యాల దిగుమతులపై నేపాల్ ఆధారపడిందని కాకద్ భిట్టాలోని ప్లాంట్ క్వారంటైన్ కార్యాలయంలోని సమాచార అధికారి తెలిపారు. ఇదే నేపాల్ లో మిల్లెట్ సాగు తగ్గిపోవడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరుధాన్యాలు మాత్రమే కాకుండా కూరగాయాల దిగుమతులు కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. నేపాల్ లోని కొండ జిల్లాల్లో కూరగాయల ఉత్పత్తి ఉన్నప్పటికీ మార్కెట్  మాత్రం దిగుమతి చేసుకున్న కూరగాయాలతో నిండి ఉంటుందని తెలుస్తోంది. 

గత ఆర్థిక సంవత్సరంలోనే నేపాల్ సుమారు రూ.211 మిలియన్ల విలువైన గుమ్మడికాయలను దిగుమతి చేసుకుందని సమాచారం. అంటే 5,075 మెట్రిక్ టన్నులు భారతదేశం నుండి నేపాల్ కు చేరాయి. అదే సమయంలో నేపాల్ 51,113 మెట్రిక్ టన్నుల టమోటాలను దిగుమతి చేసుకునేందుకు రూ.1.2 బిలియన్లు, 14,787 మెట్రిక్ టన్నుల పచ్చి మిరపకాయల కోసం రూ.295 బిలియన్లను ఖర్చు చేసింది. 

నేపాల్ లో కూరగాయాలే కాకుండా పశువుల మేత దిగుమతిలో పెరుగుదల కన్పిస్తోంది. దీంతో నేపాలీ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ లలో సరికొత్త సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. తాము కష్టపడి పండించిన పంటలను మార్కెట్ లో సరైన ధరలు లేకపోవడంతో అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

మిల్లెట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిపై యావత్ ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చిరుధాన్యాల సాగు క్రమంగా పెరుగుతుంది. దేశ, విదేశాల్లో మిల్లెట్ల సాగును ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ.. రాయితీలు అందిస్తున్నాయి. దీంతో మిల్లెట్ల పంటలను పండించడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ నేపాల్ వంటి దేశాల్లో మాత్రం చిరుధాన్యాలను పండించకపోవడంతో.. వాటి దిగుమతుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని సమాచారం. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.