మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ బోర్డు నాగపూర్ లో మాంగో, మిల్లెట్, గ్రైన్ ఫెస్టివల్ ను ప్రారంభించింది. నాగపూర్ సిటీ లో నార్త్ అంబజారి రోడ్డులో ఉన్న కుసుమ్ తాయ్ వాంఖడే భవనంలో ఈ ఫెస్టివల్ ప్రారంభమైనది. మే 16వ తేదీ నుండి మే 19 తేదీ వరకూ మొత్తం నాలుగు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనున్నది.
మాంగో, మిల్లెట్ అండ్ గ్రైన్ ఫెస్టివల్ ను మహారాష్ట్ర అగ్రికల్చర్ ప్రొడక్షన్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ కదమ్ ప్రారంభించారు. మరొక బోర్డు డైరెక్టర్ ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు. ఈ ఫెస్టివల్ ద్వారా కొత్త పారిశ్రామిక వేత్తలకు , స్టార్టప్ లకు మంచి ఆదరణ లభిస్తుంది అని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే మిల్లెట్ రైతులకు చాలా అవకాశాలు కల్పిస్తోంది అని ఆయన అన్నారు. ఇలాంటి ఫెస్టివల్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా చిరు ధాన్యాల ఉత్పత్తులను ప్రజలు నేరుగా కొంటారు అని దాని వల్ల అందరికీ చిరు ధాన్యాల పట్ల ఆసక్తి కలుగుతుంది అని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చిరు ధాన్యాల ఉత్పత్తికి మరియు అమ్మకానికి కృషి చేస్తుంది.
నాగపూర్ లో ప్రారంభమైన ఈ మిల్లెట్ ఫెస్టివల్ లో వ్యక్తిగత ఉత్పత్తిదారులు, రైతు పొదుపు సంఘాలు, సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు వాటితో పాటు స్టార్టప్ వెంచర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి ఫెస్టివల్స్ ద్వారా స్థానిక వ్యవసాయ దారులకు కూడా మంచి జరుగుతుంది అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వెల్లడించారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.