రేషన్ షాపుల్లో ప్రారంభమైన మిల్లెట్స్ పంపిణీ.

రేషన్ షాపుల్లో ప్రారంభమైన మిల్లెట్స్ పంపిణీ.

రేషన్ షాపుల్లో ప్రారంభమైన మిల్లెట్స్ పంపిణీ.

 

మన దేశంలో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతూ ఉంటారు. పోషకాహార లోపాన్ని తగ్గించుకోవాలి అంటే సరైన ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అందులోనూ చిరుధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పోషకాహార లోపం తగ్గుతుంది. శాఖాహారులకు కూడా పోషకాలు సులభంగా లభించాలి అంటే తప్పనిసరిగా చిరుధాన్యాలని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.

పోషకాహార లోపాన్ని నియంత్రణలోకి తీసుకొని రావడానికి భారత ప్రభుత్వం  ఎంతో కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా రేషన్ షాపుల్లో ఎప్పుడూ ఇచ్చే బియ్యం గోధుమలు అలాగే పప్పులతో పాటు చిరుధాన్యాలను కూడా అందించడానికి సిద్ధపడింది. ఇది కేవలం కొన్ని ప్రదేశాలలో మాత్రమే ప్రారంభించడం జరిగింది. వీటి స్పందనని ఆధారంగా తీసుకొని భవిష్యత్తులో మరికొన్ని ప్రదేశాలలో రేషన్ షాపుల్లో చిరుధాన్యాలు లభించేలా చేయడానికి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంది.

ఈ కార్యక్రమం కోసం దేశంలో నాణ్యమైన చిరుధాన్యాలను తక్కువ ధరకే అమ్మే దుకాణదారులతో దేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాలి అని నిర్ణయించుకుంది. ఈ దుకాణ సిబ్బందికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ ఆలోచనని “ది స్టాండింగ్ కమిటీ ఆన్ ఫుడ్ అండ్ కన్జ్యూమర్ ఎఫైర్స్” సంస్థకి చెందిన వారు భారత ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులను సమకూర్చడానికి సిద్ధపడింది. భారత ప్రభుత్వం దేశంలోని  5.38 లక్షల రేషన్ దుకాణాలు ఈ కార్యక్రమం యొక్క పరిధి లో కి వస్తాయి. భవిష్యత్తులో ఈ కార్యక్రమం అనేక సవాలను ఎదుర్కోవచ్చు. సరఫరా మరియు డిమాండ్ సమస్యలు కూడా తలెత్తవచ్చు అని కూడా వెల్లడించింది. 

ఈ కార్యక్రమం ఆచరణీయంగా ఉండాలి అంటే దేశంలో ఎక్కువ చిరుధాన్యాలను పండించాల్సి ఉంటుంది, డిమాండ్ పెరిగితే ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. ప్రపంచంలో మిల్లెట్స్ ఉత్పత్తిలో భారతదేశం 42% వాటానీ పొంది ఉంది. ప్రభుత్వం చిరుధాన్యాలను పండించే రైతులకు కాస్త సహాయాన్ని కల్పిస్తే ఈ వాటా మరి కాస్త పెరిగి అవకాశం ఉంది. మిల్లెట్స్ ఉత్పత్తి బాగా పెరిగితే దేశంలో పోషకాహార లోపం సులభంగా తగ్గుతుంది.


© 2023 - 2024 Millets News. All rights reserved.