Narendra Modi : భారతదేశంలో గతంలో ఎవరూ మిల్లెట్స్ సాగును పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మనదేశం సిరి ధాన్యాలు సూపర్ ఫుడ్ అని ప్రపంచానికి చాటి చెప్పింది, నేడు భాజపా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రోత్సాహకాలతో మన దేశంలో పండుతున్న మిల్లెట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది అని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అలాగే గత సంవత్సరం తన అమెరికా పర్యటన సందర్భంగా వైట్ హౌస్ లో కూడా మిల్లెట్స్ తో వండిన భోజనం వడ్డించారు అని మోడీ అన్నారు.
మిల్లెట్స్ ఉత్పత్తి చేయడంలో రాజస్థాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్స్ ఉత్పత్తి లో రాజస్థాన్ చాలా ముందు ఉన్నది అని వెల్లడించారు. 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆఫ్ మిల్లెట్స్ గా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది అని తెలిపారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ చిరు ధాన్యాలు పండించే రైతులను పట్టించుకోలేదు అని కానీ భాజపా ప్రభుత్వం మాత్రం నిబద్ధత తో చిరు ధాన్యాలను పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది అని అలాగే వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడానికి కృషి చేస్తుంది అని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు.
రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే చిరు ధాన్యాలను పండించే రైతుల కోసం ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ప్రభావంతో ప్రజలలో మిల్లెట్స్ గురించి వాటి ద్వారా అందే ఆరోగ్య ప్రమాణాల గురించి అవగాహన పెరుగుతున్నది. రాబోయే కాలంలో మిల్లెట్స్ సాగును మరింత పెంచుతూ పేద ప్రజలకు కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంచడానికి కూడా ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశ పడుతుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.