మిల్లెట్స్ పునరుద్ధరణ: కుప్విలో ఎంజీఎన్ఆర్ఈజీఏ నేతృత్వంలో సాగు

మిల్లెట్స్ పునరుద్ధరణ: కుప్విలో ఎంజీఎన్ఆర్ఈజీఏ నేతృత్వంలో సాగు

మిల్లెట్స్ పునరుద్ధరణ: కుప్విలో ఎంజీఎన్ఆర్ఈజీఏ నేతృత్వంలో సాగు

 

భారతదేశంలో మిల్లెట్స్ ( చిరుధాన్యాలు) వాడకం క్రమక్రమంగా పెరుగుతోంది. మిల్లెట్స్ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్న నేపథ్యంలో ప్రజలు వీటిని రోజూవారీ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని రైతులు చిరుధాన్యాలను విరివిగా సాగు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సిమ్లాలోని కుప్విలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( ఎంజీఎన్ఆర్ఈజీఏ) ద్వారా అధికారులు మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా మిల్లెట్స్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లా చోపాల్ తహసీల్ లోని కుప్వి సబ్ డివిజన్ లో అధికారులు ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా మిల్లెట్స్ సాగు చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పిస్తూ.. ప్రోత్సహిస్తున్నారు. గోధుమ, బియ్యం మరియు మొక్కజొన్న వంటి సంప్రదాయ తృణధాన్యాల కంటే మిల్లెట్ లలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇది వరకు కుప్పి ప్రాంతం రాగులు ( ఫింగర్ మిల్లెట్స్), కొర్రలు ( ఫాక్స్ టైల్ మిల్లెట్స్), ఊదలు ( బార్న్యార్డ్ మిల్లెట్స్) వంటి విభిన్నమైన మిల్లెట్ రకాలకు బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల కాలంలో పోషకధాన్యాలైన మిల్లెట్స్ పై రైతులకు ఆసక్తి తగ్గిందని తెలుస్తోంది.

తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( ఎంజీఎన్ఆర్ఈజీఏ) ద్వారా బ్లాక్ డెవలప్‎మెంట్ అధికారి నేతృత్వంలో.. చిరుధాన్యాలను పండించడంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. కాగా కుప్పిలోని బ్లాక్ డెవలప్ మెంట్ కార్యాలయం చిరుధాన్యాల పునరుద్ధరణ అంశంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక రైతులు మరియు వ్యవసాయ శాఖ సహాకారంతో అధికారుల బృందం మిల్లెట్స్ సాగును ప్రోత్సహించింది. ఇప్పటికే 80 మందికి పైగా రైతులు మిల్లెట్స్ ను సాగు చేస్తుండగా.. సంవత్సరం పూర్తయ్యే సరికి సుమారు 300 మంది రైతులను, డిసెంబర్ 2026 నాటికి 500 మంది రైతులను ఇందులో భాగస్వాములను చేయాలని అధికారులు భావిస్తున్నారు.

చిరుధాన్యాలను ‘‘ పోషక తృణధాన్యాలు’’ గా ప్రోత్సహించాలన్న డిప్యూటీ కమిషనర్ నిబద్ధతతో సిమ్లా జిల్లా యంత్రాంగం మిల్లెట్స్ సాగును మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణంలో కలిగే మార్పులతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనడంలో మిల్లెట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు రైతుల జీవనోపాధిని పెంచడానికి అధికారులు విశేష కృషి చేస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. హిమాచల్ ప్రదేశ్ లోని అన్ని మారుమూల ప్రాంతాల్లోనూ ఆహార భద్రతను కాపాడే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. 

 


© 2023 - 2025 Millets News. All rights reserved.