నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవలసిన అవసరం చాలా ఉంది, అయితే పోటీ ప్రపంచంలో ఆరోగ్యం గురించి తీసుకుంటున్న శ్రద్ధ తగ్గిపోతుంది. చిరు ధాన్యాలు అందరికీ మేలు చేస్తాయి అని అవగాహన వచ్చినా కూడా వాటి వాడకం తెలియక లేదా దగ్గరలో లభ్యం అవ్వక చాలా మంది ఇప్పటికీ వాటికి దూరంగానే ఉంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అందరికీ చిరు ధాన్యాలు అందుబాటులో ఉండాలి అని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ శరకడం గారు ప్రతీ మండలానికి ఒక మిల్లెట్స్ స్టోర్ ఉండేలా రూపొందించారు. ఇప్పటికే అనేక మండలాల్లో స్టోర్స్ సిద్దమవ్వగా మిగతా వాటికి కూడా అత్యంత త్వరలో ఈ స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ , మాదాపూర్ లోని వెస్ట్ సైడ్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో Millets the Best Food ( MBF) ప్రొడక్ట్స్ ను ప్రదర్శించారు. MBF స్టోర్స్ లో చిరు ధాన్యాలతో పాటుగా ఆర్గానిక్ గా తయారుచేసిన మరికొన్ని ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి అని ఆయన వెల్లడించారు. నాణ్యమైన ఆహారం ప్రతీ ఒక్కరికీ అందించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అని, అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వలన ప్రజల జీవనశైలి ఆరోగ్యం మెరుగు అవుతాయి అని అన్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.