ఒడిశా మిల్లెట్స్‌కు కొత్త గుర్తింపు… క్లైమేట్ ఫ్రెండ్లీ ఫార్మింగ్‌ లో భారీ అవకాశాలు

ఒడిశా మిల్లెట్స్‌కు కొత్త గుర్తింపు… క్లైమేట్ ఫ్రెండ్లీ ఫార్మింగ్‌ లో భారీ అవకాశాలు

ఒడిశా మిల్లెట్స్‌కు కొత్త గుర్తింపు… క్లైమేట్ ఫ్రెండ్లీ ఫార్మింగ్‌ లో భారీ అవకాశాలు

 

ఒడిశా (Odisha) లో సాగు చేస్తున్న సంప్రదాయ మిల్లెట్ రకాలు క్లైమేట్ చేంజ్‌ ను ఎదుర్కొనే వ్యవసాయానికి కీలకంగా మారుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన Nature Scientific Reports లో ప్రచురితమైంది.

కోరాపుట్ (Koraput), మల్కాన్గిరి (Malkangiri), మయూర్భంజ్  (Mayurbhanj), రాయగడ (Rayagada) ప్రాంతాల్లో గిరిజన రైతులు సాగు చేస్తున్న ఫింగర్ మిల్లెట్ రకాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మొత్తం 13 రకాలలో కొన్ని అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు గుర్తించారు.

గుప్తేశ్వర్ భారతి (Gupteswar Bharathi), కుంద్రా బాతి (Kundra Bati), లక్ష్మి పూర్ కైలా (Laxmipur Kalia), మాల్యాబంత్ మామి (Malyabant Mami) వంటి రకాలు కఠిన పరిస్థితుల్లో కూడా స్థిరమైన దిగుబడిని ఇచ్చాయి  ముఖ్యంగా గుప్తేశ్వర్ భారతి అన్ని ప్రాంతాల్లో మంచి ఫలితాలు చూపుతూ ప్రత్యేకంగా నిలిచింది.

ఈ మిల్లెట్స్‌లో ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం కూడా మరో హైలైట్ .  కోరాట్పుట్ లో పండించిన పంటల్లో ప్రోటీన్, మినరల్స్ మరింతగా ఉన్నట్లు గుర్తించారు.

అదనంగా, ఈ పంటలు గింజలతో పాటు పశువులకు మేతగా ఉపయోగపడే స్టోవర్‌ను కూడా ఎక్కువగా ఇస్తాయి. దీంతో రైతులకు అదనపు లాభం లభిస్తుంది.

నిపుణులు ఈ సంప్రదాయ మిల్లెట్ రకాలను సంరక్షించి, ప్రోత్సహిస్తే ఫుడ్ సెక్యూరిటీ మెరుగుపడటంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. కొంతమంది రకాలకు GI (Geographical Indication) హోదా ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు ????

 


© 2023 - 2026 Millets News. All rights reserved.