ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ ని ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టారు. మిల్లెట్స్, మిల్లెట్స్ ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రముఖ అంతర్జాతీయ K12 స్కూల్ బ్రాంచ్ లలో ఒకటైన పూణేలోని హింజేవాడి క్యాంపస్‌లో మిల్లెట్స్‌పై వర్క్‌షాప్ ని నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో మిల్లెట్‌ల రకాలు గురించి చెప్పడమే కాక జంక్ ఫుడ్, మైదాకు కాకుండా మిల్లెట్స్ తో కూడిన కొన్ని ఇంటి వంటకాలపై విద్యార్థులకు అవగాహన ని కల్పించారు.
మిల్లెట్ స్టోరీ కో ఫౌండర్ శ్రీమతి ప్రతిభా ఇటగి (Ms. Pratibha Itagi) నేతృత్వంలో ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు తో ఈ వర్క్ షాప్ జరిగింది. కొర్రలు (Foxtail millets), అండు కొర్రలు (Browntop Millets), సామలు (Little millets), అరికలు (Kodo millets) ఊదలు (Barnyard millets) వంటి ఐదు పాజిటివ్ మిల్లెట్స్ గురించి చెప్పడమే కాక ఎలా తయారు చేయాలో తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చారు.
వర్క్ షాప్ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత శ్రీమతి శిఖా త్రిపాఠి, ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ మిల్లెట్స్ ఆరోగ్య ప్రయోజనాలని వివరించారు. అలానే డైట్లో ప్రతి ఒక్కరూ మిల్లెట్స్ ని చేర్చుకోవడం ఎంత ముఖ్యమో చెప్పారు. మిల్లెట్ స్టోరీ కో ఫౌండర్ అలానే చీఫ్ గెస్ట్ అయిన శ్రీమతి ప్రతిభా ఇటగి పిల్లలకి అలానే వారి తల్లిదండ్రులకి మిల్లెట్స్ గురించి అవగాహనని కల్పించారు.
ప్రతిరోజు మిల్లెట్స్ ని చేర్చుకోవడం వలన కలిగే లాభాల గురించి ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరు ఎంతో చురుకుగా పాల్గొని, ఈ వర్క్ షాప్ ని విజయవంతంగా నిర్వహించాలని ఆమె అన్నారు. ఈ వర్క్ షాప్ ద్వారా మిల్లెట్స్ ని తీసుకోవడం వలన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందని, బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతుందని తెలిపారు. గోధుమలు, బియ్యం వంటి వాటికంటే మిల్లెట్స్ ని తీసుకోవడం ఆరోగ్యమని ఉబకాయం వంటి సమస్యలు దరి చేరవని ఈ వర్క్ షాప్ ద్వారా తెలియజేసారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.