ఆఫ్రికాలో చిరుధాన్యాల సాగు కోసం రంగం సిద్ధం..!!

ఆఫ్రికాలో చిరుధాన్యాల సాగు కోసం రంగం సిద్ధం..!!

ఆఫ్రికాలో చిరుధాన్యాల సాగు కోసం రంగం సిద్ధం..!!

 

ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాలు (మిల్లెట్స్) పై అవగాహన పెరుగుతుండటంతో వాటి సాగు, వాడకం విరివిగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో భూతాపం, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మరియు నీటి కొరత వంటి పలు సమస్యల కారణంగా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటువంటి సవాళ్ల నుంచి బయటపడటానికి ఉన్న ఒకే ఒక మార్గం చిరుధాన్యాల సాగు. మిల్లెట్స్ ను సాగు చేయడం సులభమే కాదు.. దీని ద్వారా కలిగే ప్రయోజనాలు కూడా అపారమని చెప్పుకోవచ్చు. 

తాజాగా ఆఫ్రికా సైతం ఆహార భద్రతపై దృష్టి సారించింది. పురాతన ధాన్యాలను సాగు చేయడంపై ఆసక్తి కనబరుస్తుంది. గత ముఫ్పై ఏళ్లలో ఆఫ్రికా జనాభా రెండింతలు పెరిగినప్పటికీ.. ఆహార ఉత్పత్తి ప్రపంచ సగటు కంటే తక్కువ ఉందని తెలుస్తోంది. అంతేకాదు ప్రపంచంలో వ్యవసాయం చేయడానికి పనికి వచ్చినా.. సాగు చేయకుండా ఉన్న భూమిలో సుమారు 65 శాతం ఆఫ్రికాలో ఉండటం గమనార్హం. ఆఫ్రికాలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చినా ఆహార పంటలను సాగు చేయడం సులభం. 

ఇప్పటివరకు ఆఫ్రికాలోని కమ్యూనిటీలు చాలా కాలంగా స్థానిక పంటలనే పండిస్తున్నాయి. వరి, గోధుమ మరియు మొక్కజోన్న వంటి పంటలను పండించడం..ఇతర పంటల నిర్లక్ష్యానికి దారితీసింది. దీంతో వాటిని ఇప్పుడు అనాథ పంటలుగా పిలుస్తున్నాం. అయితే చిరుధాన్యాల పంటలు ప్రకృతి అందిస్తున్న వరాలనే చెప్పుకోవచ్చు. అంతేకాదు చిరుధాన్యాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. 

ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి 2023 ను ‘మిల్లెట్ సంవత్సరం’ గా గుర్తించింది. చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, రాగి, ఇనుము మరియు సెలీనియం వంటి పలు ఖనిజాలు ఉన్న నేపథ్యంలో మిల్లెట్స్ ను ‘‘ సూపర్ ఫుడ్స్’ గా పరిగణిస్తారు. నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం మిల్లెట్స్ ను సాగు చేయవచ్చు. వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పుల వలన ఎదురయ్యే సవాళ్లే కాకుండా వీటిలో ఉండే పోషకాల దృష్ట్యా .. మిల్లెట్స్ ను మళ్లీ విస్తృతంగా సాగు చేయాలని ఆఫ్రికా భావిస్తోంది. అంతేకాదు ఆ దిశగా అడుగులు వేస్తూ ఆహార భద్రత కోసం ప్రణాళికలు రచిస్తోంది. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.