ఈశాన్య భారతదేశంలోని చిన్న కొండ రాష్ట్రమైన త్రిపుర చిరుధాన్యాలను సాగు చేయడంలో కొత్త మైలురాయిని చేరుకుంది. జాతీయ స్థాయిలో అందుతున్న ప్రోత్సాహానికి అనుగుణంగా మిల్లెట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఇప్పటికే యావత్ ప్రపంచ వ్యాప్తంగా మిల్లెట్ ఉత్పత్తిలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఈ క్రమంలోనే మిల్లెట్ సాగును మరింతగా పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి రైతులను ప్రోత్సహిస్తున్నారన్న సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే వివిధ వేదికలలో మిల్లెట్ సాగు మరియు వాటి వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా స్థితిస్థాపక మరియు పోషకాహార పంటలైన మిల్లెట్స్ సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో రైతులు కూడా చిరుధాన్యాలను సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఇందులో భాగంగానే త్రిపుర మిల్లెట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతిని సాధిస్తోందని చెప్పుకోవచ్చు.
మిల్లెట్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ సహాకారంతో రాష్ట్ర సర్కార్ పలు పథకాలను అమలు చేస్తోంది. చిరుధాన్యాలను పండించడానికి అవసరమైన యంత్ర పరికరాలతో పాటు రైతులకు సాగుపై అవగాహన కల్పించాయి. చిరుధాన్యాల సాగులో త్రిపుర సాధించిన విజయంలో ప్రభుత్వ అధికారులు కీలక పాత్ర పోషించారు. రైతులకు మద్ధతు తెలుపుతూ.. కావాల్సిన వనరులను అందించారు. రైతులతో కలిసి అధికారులు చేసిన ఈ ప్రయత్నం మిల్లెట్ సాగును విజయవంతం చేసింది.
పోషకాలు పుష్కలంగా ఉండే ఈ ధాన్యాల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలియడంతో ప్రభుత్వం మరియు రైతులు చేసిన సమిష్టి కృషి ఫలించింది. త్రిపురలో మిల్లెట్ పంటల సాగు సాధారణంగా మారిందని తెలుస్తోంది. ఇది రాష్ట్ర వ్యవసాయంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. భిన్నమైన వాతావరణ పరిస్థితులే కాకుండా కొండ ప్రాంతాల్లోనూ చిరుధాన్యాల సాగు అనుకూలతను అక్కడి రైతులు గమనించారు.
దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా మిల్లెట్స్ కు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంలోనే ప్రభుత్వ మరియు రైతు సహకారానికి త్రిపుర ఒక నమూనాగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మిల్లెట్ ఉత్పత్తిలో త్రిపుర సాధించిన విజయాలతో మిల్లెట్ సాగులో భారతదేశం అగ్రగామిగా ఉండటమే కాకుండా ఇతర ప్రాంతాలు కూడా దీన్ని అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
త్రిపుర ప్రభుత్వం నేతృత్వంలో వ్యవసాయం మరియు పరిశోధనా సంస్థ సంయుక్తంగా మిల్లెట్ సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడి రైతులు అందరికీ చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువల గురించి తెలుసు. మిల్లెట్స్ అద్భుతమైన పంట. వీటిని ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పండించవచ్చు. చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటు ఇవి గ్లూటెన్ ఫ్రీ. అంతేకాదు త్రిపురలోని రైతులు సైతం మిల్లెట్ సాగుపై ఆసక్తిగా ఉన్నారు. చిరుధాన్యాలలో చాలా రకాలున్నాయంటున్న రైతులు ప్రభుత్వం నుంచి సహాకారం లభిస్తుందని తెలిపారు. విత్తనాలు, ఎరువులతో పాటు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం నుంచి పొందుతున్నామని వెల్లడించడం విశేషం.
© 2023 - 2024 Millets News. All rights reserved.