రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వినియోగ ఉత్పత్తుల విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), సౌత్ ఇండియాలో ప్రముఖ హెల్త్ ఫుడ్ సంస్థ అయిన సదరన్ హెల్త్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ₹156.42 కోట్లకు కొనుగోలు చేసింది.
తమిళనాడులో బలమైన గుర్తింపు కలిగిన “మన్నా ” (Manna) బ్రాండ్, మిల్లెట్ ఆధారిత ఆహారాలు, హెల్త్ మిక్స్ లు, శిశు ఆహారం, మరియు బ్రేక్‌ఫాస్ట్ ఉత్పత్తులతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకుంది.
ఈ ఒప్పందంతో సదరన్ హెల్త్ ఫుడ్స్ ఇప్పుడు RCPLకు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా మారింది. ఇది హెల్త్ & న్యూట్రిషన్ విభాగంలో RCPL విస్తరణ వ్యూహంలో కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
ఈ సందర్బంగా RCPL డైరెక్టర్ “టి. కృష్ణకుమార్” మాట్లాడుతూ, మన్నా బ్రాండ్‌కు వినియోగదారుల్లో బలమైన నమ్మకం ఉందని, తమ పంపిణీ నెట్‌వర్క్ ద్వారా ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఈ కొనుగోలు ద్వారా హెల్త్ ఫుడ్ మార్కెట్ లో RCPL తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకుంటూ, దేశవ్యాప్తంగా వినియోగదారుల ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.
© 2023 - 2026 Millets News. All rights reserved.