అంతే కాకుండా వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ప్రజల ఆరోగ్యానికి చిరు ధాన్యాలు చాలా మేలు చేస్తాయి. అలాగే చిన్న పిల్లల ఎదుగుదల విషయంలో వారి ఇమ్యూనిటి పెంచడంలో కూడా మిల్లెట్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే మిల్లెట్స్ సాగు మీద దృష్టి సారించిన కేంద్రం , ఇప్పుడు చిరు ధాన్యాలను తక్కువ ధరకు ప్రజలకు అందించడానికి కొత్త పథకం తీసుకుని వస్తుంది.
ఇప్పటి వరకూ దేశంలోని రేషన్ షాపులు ( చౌక దుకాణం) లో ఆయా రాష్ట్రాల ఆహార విధానాల ప్రకారంగా బియ్యం, గోధుమలు, కందిపప్పు లాంటి మరికొన్ని సరకులను పేదలకు తక్కువ ధరకు అందిస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా చిరు ధాన్యాలను ( Millets) కూడా రేషన్ షాపుల ద్వారా పేదలకు అందజేయాలి అని భావిస్తున్నది. ఇలా రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాలను పంపిణీ చేయడం వలన అవి నేరుగా పేద ప్రజలకు చేరుతాయి అని వాటి ద్వారా బాలల్లో పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు అని భావిస్తుంది.
అయితే ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మరి కొంత సమయం పట్టవచ్చు. ముందుగా కొన్ని రాష్ట్రాలలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి అక్కడ విజయవంతం అయితే అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్నది. అయితే ఈ పథకం ప్రారంభ తేదీ ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇప్పటి వరకూ అంగన్ వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా కూడా చాలా మంది పిల్లలకు అవి కూడా అందడం లేదు. తాజాగా కేంద్రం ప్రారంభించే ఈ పథకం ద్వారా పిల్లలలో పౌష్టికాహార లోపం తీరడంతో పాటుగా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.