SKUAST-K : ఆహార వైవిధ్యం, పర్యావరణ సుస్థిరత కోసం చిరుధాన్యాల పంటలు

SKUAST-K : ఆహార వైవిధ్యం, పర్యావరణ సుస్థిరత కోసం చిరుధాన్యాల పంటలు

SKUAST-K : ఆహార వైవిధ్యం, పర్యావరణ సుస్థిరత కోసం చిరుధాన్యాల పంటలు

 

వాతావరణ మార్పుల ప్రభావాలను అధిగమించడానికి పంట మార్పిడిలో చిరుధాన్యాలను చేర్చాలని నిపుణులు పిలుపునిస్తున్నారు.  ఆహార వైవిధ్యం, పర్యావరణ సుస్థిరత కోసం  షేర్ ఎ కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కాశ్మీర్ ( ఎస్కేయూఏఎస్టీ -కే)  సుమారు వారం రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాశ్మీర్ లోని వడూరులోని వ్యవసాయ శాఖ అధికారులు ‘‘ ఆహార వైవిధ్యం మరియు పర్యావరణం కోసం మిల్లెట్ల అన్వేషణ’’ అనే అంశంపై కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యశాలను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా శాస్త్రీయ శిక్షణా కార్యక్రమాలను ఏకీకృతం చేయడం ద్వారా దేశంలో పరిశోధనలను విస్తరించే అవకాశం ఉంది. అదేవిధంగా శిక్షణ ఇస్తూ.. స్కిల్ ఇంటర్న్ షిప్ ల కోసం అవకాశాలను కల్పించనుంది.

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ( ఎస్ఈఆర్బీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన ప్రారంభమైంది. SKUAST- కాశ్మీర్ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి 25 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యాపకులను ఒకే వేదికపై చేర్చింది. చిరుధాన్యాలను స్థిరమైన పంట ఎంపికగా ఎంచుకోవడంపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించనుంది. కాగా కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఎస్కేయూఏఎస్టీ - కే ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ రైహానా హబీబ్ కాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తరువాత ఆహార వైవిధ్యం, పర్యావరణ సుస్థిరత కోసం మిల్లెట్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

సాధారణంగా చిరుధాన్యాలు స్థితిస్థాపకంగా ఉండే పంటలన్న సంగతి తెలిసిందే. ఇవి స్థానిక వాతావరణ పరిస్థితులను అనుగుణంగా ఉంటాయి. కాశ్మీర్ వ్యాప్తంగా వ్యవసాయదారులకు చిరుధాన్యాల సాగు ప్రయోజనాలను వివరించాల్సిన అవసరం ఉందని నిపుణులు పిలుపునిచ్చారు. విభిన్నమైన వాతావరణ మార్పులను అధిగమించడానికి రైతులు తమ పంటల్లో మిల్లెట్స్ ను ఎక్కువగా చేర్చుకుంటున్నారని తెలిపారు. 

అయితే.. వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా కొత్త చిరుధాన్యాల రకాలను ఉపయోగించడంతో పాటు సాగు సమయాలను సర్దుబాటు చేయడం మరియు సేంద్రీయ ఎరువుల వాడకం వంటి పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారని డాక్టర్ సక్సేనా వెల్లడించారు. ఇక కార్యశాల -0491 కోర్సు డైరెక్టర్ డాక్టర్ అమ్జద్ మసూద్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమం గురించి వివరణ ఇచ్చారు. ఆహార వైవిధ్యీకరణలో చిరుధాన్యాల అవసరాన్ని తెలియజేశారు. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.