NEDFI మిల్లెట్ స్టడీ ఫైనల్ డ్రాఫ్ట్‌ పై స్టేక్‌ హోల్డర్స్ సమీక్ష...

NEDFI మిల్లెట్ స్టడీ ఫైనల్ డ్రాఫ్ట్‌ పై స్టేక్‌ హోల్డర్స్ సమీక్ష...

NEDFI మిల్లెట్ స్టడీ ఫైనల్ డ్రాఫ్ట్‌ పై స్టేక్‌ హోల్డర్స్ సమీక్ష...

 

అరుణాచల్ ప్రదేశ్‌ లో మిల్లెట్ రంగ భవిష్యత్తుపై (North Eastern Development Finance Corporation Ltd (NEDFI) రూపొందించిన సమగ్ర అధ్యయన ఫైనల్ డ్రాఫ్ట్‌ ను ఇటీవల ఈస్ట్ సియాంగ్ క్రిషి విగ్యాన్ కేంద్ర (East Siang Krishi Vigyan Kendra) లో నిర్వహించిన స్టేక్‌ హోల్డర్స్ సమావేశంలో సమీక్షించారు. ఈ అధ్యయనం మిల్లెట్ సాగు ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలిక, స్థిరమైన ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో లోతుగా విశ్లేషించింది.

అయితే NEDFI యొక్క Techno Economic Development Fund (TEDF) కింద సిద్ధమైన ఈ నివేదికలో మిల్లెట్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, వాల్యూ యాడిషన్, మార్కెట్ విస్తరణ అవకాశాలను పరిశీలించారు. జిల్లాల వారీగా ఫీల్డ్ సర్వేలు నిర్వహించి ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు అలాగే ఆయా ప్రాంతాల పంట నమూనాలు వంటి అంశాలను విశ్లేషించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్న సంప్రదాయ వ్యవసాయ విధానాలు, స్థానిక ఆహార వ్యవస్థల ప్రాధాన్యతను కూడా ప్రస్తావించారు.

అలాగే రిపోర్ట్‌లో తక్కువ దిగుబడి, నాణ్యమైన విత్తనాల కొరత, ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్ల లోపం, నిల్వ–బ్రాండింగ్–మార్కెటింగ్‌ లో గ్యాప్‌లు వంటి కీలక సమస్యలను గుర్తించారు. సమావేశంలో పాల్గొన్నవారు మిల్లింగ్ సదుపాయాల బలోపేతం, మిల్లెట్ల పోషక ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెంపు, వ్యవసాయ సాంకేతిక మద్దతు విస్తరణపై సూచనలు చేశారు. 

సరైన ప్రణాళిక, పెట్టుబడులు, మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు ప్రోత్సాహం, రైతు సంఘాలకు మద్దతు అందిస్తే మిల్లెట్ రంగంలో  అరుణాచల్ ప్రదేశ్ లో ఆదాయం పెంపు, ఉపాధి సృష్టి, స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి కీలకంగా మారుతుందని నివేదిక స్పష్టం చేసింది.


© 2023 - 2026 Millets News. All rights reserved.