ఈరోజుల్లో మిల్లెట్స్ వాడకం విపరీతంగా పెరిగింది. మిల్లెట్స్ కి డిమాండ్ కూడా బాగా ఎక్కువైంది. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో లెనోవా సహాయంతో రైతులు మిల్లెట్స్ ని పండిస్తున్నారు. కేరళ తిరువనంతపురానికి 323 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడుక్కి జిల్లాలోని కంతల్లూర్ గ్రామపంచాయతీ రైతులు మిల్లెట్స్ సాగు చేస్తున్నారు. ''లెనోవో ఇండియా వర్క్ ఫర్ హ్యూమన్ కైండ్'' ప్రాజెక్ట్ ద్వారా ఇది సాధ్యమైంది. కేరళలోని కాంతాలూరు గ్రామ పంచాయతీ గిరిజన రైతులకు లెనోవా ఇండియా సపోర్ట్ ఉండడంతో ''కంతల్లూర్ మిల్లెట్'' బ్రాండ్ ని మొదలు పెట్టారు.
ఇక్కడ రైతులు పండించిన మిల్లెట్స్ ని ఇక్కడే ప్రాసెస్ చేసి, ''కంతల్లూర్ మిల్లెట్'' బ్రాండ్ తో మార్కెట్లోకి వస్తాయి. కేరళ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఐహెచ్ఆర్డి కాలేజ్ కంతల్లూర్ గ్రామపంచాయతీ అధ్యక్షుడు, స్థానిక హోమ్ స్టేట్స్ సంస్థలు, గ్రామ ప్రజలు ఈ ప్రాజెక్టులో వాటాదారులుగా మారి సహకారాన్ని అందించారు. ప్రారంబాహం లో కేవలం 25 మంది రైతులు మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. వివిధ రకాల మిల్లెట్స్ ని అంతరించిపోకుండా కాపాడటం మాత్రమే కాకుండా, మంచి ఆదాయాన్ని కూడా తీసుకువస్తున్నారు.
ప్రారంభంలో 14 ఎకరాల్లో మాత్రమే మిల్లెట్స్ ని సాగు చేసేవారు. ఇప్పుడు ఏకంగా 50 ఎకరాల్లో మిల్లెట్స్ ని సాగు చేస్తున్నారని ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని లెనోవా ఇండియా ఫిలాంతరఫీ హెడ్ ప్రతిమ హరిత గర్వంగా చెబుతున్నారు. అలానే, లబ్ధిదారులు కూడా ఎంతో గర్వపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమవ్వడం స్థానిక రైతులకి గొప్ప అవకాశంగా భావిస్తున్నామని ఇదే గ్రామానికి చెందిన రైతు అంజు నాడూర్ చెప్తున్నారు.
శతాబ్దాలకు గిరిజన ప్రాంతాల్లో ప్రధాన ఆహారంగా వుండే మిల్లెట్స్ ని పండించడం గొప్ప విషయం అని అంగన్వాడీ వర్కర్ ఉష అన్నారు. చిన్నపిల్లలకి కూడా మిల్లెట్స్ ని పెట్టొచ్చని ఇది మంచి ప్రయోజనాలని అందిస్తుందని, అన్ని రకాల పోషకాలు ఉంటాయని, ఈ ప్రాజక్టులో భాగమైన 19 ఏళ్ల వినీత అనే రైతు చెప్పారు. నా స్నేహితులను కూడా మిల్లెట్స్ ని పండించమని ప్రోత్సహిస్తున్నానని వినీత అన్నారు.
లెనోవో ఉద్యోగులు ఈ ప్రాజెక్టుని పెద్ద మార్పు తీసుకువచ్చేలాగ చూస్తారని, నేను కేవలం డివైస్లని ఏర్పాటు చేయడమే కాకుండా IHRD కళాశాల విద్యార్థులకి, ఫ్యాకల్టీ కి ట్రైనింగ్ ఇస్తామని, బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ అలానే SMEలు, హోమ్‌స్టే యజమానులు మరియు విద్యార్థి వాలంటీర్‌లతో కలిసి మిల్లెట్స్ ప్రొడక్షన్ గురించి చెప్తామని లెనోవో ఇండియా ప్రీమియర్ సపోర్ట్ టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ప్రశాంత్ ఆర్పి చెప్పారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.