చిరు ధాన్యాల వాడకంతో ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతూ ఉండడంతో భారత ప్రభుత్వం మిల్లెట్స్ ఉత్పత్తిని పెంచడానికి కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం మిల్లెట్స్ సాగు చేసే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించనున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మాట్లాడుతూ “ 12 లక్షల మంది రైతులకు మొక్కజొన్న విత్తనాలు, 8 లక్షల మంది రైతులకు సజ్జలు (Pearl millets) , 4 లక్షల మంది రైతులకు పెసర అలాగే లక్ష మంది రైతులకు జొన్న విత్తనాలు ఉచితంగా సరఫరా చేస్తున్నాం” అని తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈ విత్తనాల కిట్లను రైతులకు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని మొత్తం మిల్లెట్స్ ఉత్పత్తి లో రాజస్థాన్ వాటా 26 శాతంగా ఉంది అని సజ్జల ఉత్పత్తిలో 41% రాష్ట్రం నుండే లభిస్తుంది అని ఆయన అన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వం మిల్లెట్స్ ను ప్రమోట్ చేయడానికి తనవంతు కృషి చేస్తుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి 40 కోట్ల రూపాయలను కేటాయించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని హోటల్స్ లో మిల్లెట్స్ తో చేసిన వంటకాలను కూడా అందించాలని సీయం భజన లాల్ శర్మ విజ్ఞప్తి చేశారు. మిల్లెట్స్ ప్రజల ఆరోగ్యం ను కాపాడడంతో పాటు సాగు చేసే రైతులకు కూడా లాభసాటిగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో మిల్లెట్స్ సాగు కోసం రైతులకు అనేక రకాలైన ప్రోత్సహాలు అందిస్తుంది. రాబోయే కాలంలో భారతదేశం మిల్లెట్స్ ఎగుమతికి ప్రధాన వనరుగా అభివృద్ధి చేయడం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.