చిరుధాన్యాలు .. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇవి పురాతన ధాన్యాలు అయినప్పటికీ వీటిపై ప్రజలకు అవగాహన పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను భాగంగా చేసుకుంటున్నారు. అయితే మన దేశంలో ఒక దశాబ్దం క్రితం మిల్క్ బ్రెడ్ మాత్రమే ఉండేది. ఆ తరువాత గోధుమ మరియు అటాతో రొట్టెలను తయారు చేసిన రొట్టెలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం సోర్డు, కొరియన్ బన్స్, మల్టీగ్రెయిన్ పిండి మరియు మిల్లెట్స్ తో తయారు చేసిన రొట్టెలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు రెస్టారెంట్లు, హోటళ్లలోని మెనూలతో పాటు దాదాపు ప్రతి ఇంటిలోనూ ఈ రొట్టెలను ఆహారంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రొట్టెలను తయారు చేసే వారు కూడా వారసత్వ ధాన్యాలు, స్థానిక పదార్థాలతో విభిన్నమైన రొట్టెలను తయారు చేస్తున్నారు. పనీర్ మఖ్నీ, బుక్వీట్ రొట్టెలు, తాండాయ్ చౌక్స్ వంటి రొట్టెలు ప్రజాదరణ పొందుతున్నాయని చెప్పుకోవచ్చు.
ఐరోపాలో ఉండే ప్రణవ్ ఉల్లాల్ అనే వ్యక్తి అక్కడ ఉన్న సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో.. ప్రేరణ పొంది ఒక లక్ష్యంతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. లక్ష్యసాధనలో భాగంగా స్థానిక పదార్థాలే కాకుండా దేశ వ్యాప్తంగా లభించే అనేక రకాల ధాన్యాలను కనుగొన్నారు. అనంతరం 2018 లో బెంగళూరులో లోఫర్ అండ్ కో అనే సంస్థను స్థాపించారు. అక్కడ ఎన్నో రకాల రొట్టెలను పరిచయం చేశారు. ఇందులో భాగంగా మిల్లెట్ ఫోకాసియాతో సహా మిల్లెట్స్ తో తయారు చేసిన రొట్టెలు, గోధుమలతో తయారు చేసిన రొట్టెలు, జపనీస్ పాల రొట్టెలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
అంతేకాదు.. కొత్త కొత్త రొట్టెలను తయారు చేయడానికి తాము వివిధ ధాన్యాలతో ప్రయోగాలు చేస్తున్నామని ప్రణవ్ ఓ సందర్భంలో తెలిపారు. ప్రపంచ పాక సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందుతూ ఈ రొట్టెలను తయారు చేస్తున్నామన్నారు. చిరుధాన్యాలు, నల్ల బియ్యం మరియు బుక్వీట్ వంటి ధాన్యాలను ఇప్పటివరకు వినియోగించామని చెప్పారు. అలాగే తాము అందించే మెనూలో సోర్డు, గోవా పోయ్ వంటి విభిన్న రకాల రొట్టెలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే గత రెండు సంవత్సరాలుగా ప్రధానంగా అందించే రొట్టెల్లో మార్పు లేదన్నారు. ప్రతి వారం స్పెషల్స్ ఉంటాయన్న ఆయన తమ వద్ద కేపర్ మరియు ఆలివ్ ఫోకాసియా రోల్స్, చిరుధాన్యాలు మరియు విత్తనాలతో తయారు చేసిన రొట్టెలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడించారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.