డాక్టర్ వద్దకు అవసరం లేదు.. ఇక మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. డాక్టర్ ఖాదర్ వలీ

డాక్టర్ వద్దకు అవసరం లేదు.. ఇక మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. డాక్టర్ ఖాదర్ వలీ

డాక్టర్ వద్దకు అవసరం లేదు.. ఇక మన ఆరోగ్యం మన చేతుల్లోనే..     డాక్టర్ ఖాదర్ వలీ

 

ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. రోజువారీ షెడ్యూల్ లో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే కనుక డాక్టర్ వద్దకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది... మనం తినే ఆహారమే దీనికి ప్రధాన కారణం.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మిల్లెట్స్ (చిరుధాన్యాలు) కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆరోగ్యం విషయంలో చిరుధాన్యాల ఆవశ్యకతపై మిల్లెట్ మ్యాన్ , శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ అనేక పరిశోధనలు చేశారు. అంతేకాదు సిరిధాన్యాల పునరుద్ధరణకు సుమారు ఇరవై ఏళ్లుగా శ్రమిస్తున్నారు. తాజాగా మైసూర్ లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ ప్రజలకు ఓ సందేశాన్ని అందించారు. వంటగదిలో కోల్పోయిన ఆరోగ్యాన్ని ఆస్పత్రికి వెళ్లిన పొందలేమని డాక్టర్ ఖాదర్ వలీ తెలిపారు. ఈ సందర్భంగానే అధిక ప్రోటీన్ వినియోగంపై హెచ్చరికలు జారీ చేసిన ఆయన ఇది మధుమేహం సహా  ఇతర సమస్యలపై ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుందో వివరించారు. 

బియ్యం, గోధుమలు, చక్కెర, పాలు వంటి సాధారణ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలను డాక్టర్ ఖాదర్ వలీ తెలిపారు. అలాగే పురుషులు, మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలను వెల్లడించారు. పాలల్లో ఉండే కాల్షియం ప్రయోజనాలను ప్రశ్నించిన ఆయన పాల వినియోగం ఊహించినంత మంచిగా ఉండదని చెప్పారు. ఇందులో లోపాలు ఉన్నప్పటికీ కొందరు వైద్య నిపుణులు పాల వాడకాన్ని సమర్థిస్తారని ఖాదర్ వలీ పేర్కొన్నారు. అయితే పాలు తీసుకోవడం తగ్గించడం వలన దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని ఆయన సూచించారు. 

 

మెరుగైన ఆరోగ్య ఫలితాల కోసం బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర వంటి ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని డాక్టర్ ఖాదర్ వలీ కోరారు. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గానూ తగిన ఆహారాన్ని ఎంచుకోవాలని సూచించారు. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడంలో చిరుధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్ కేంద్రాల విస్తరణ అంశాన్ని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రతి ఒక్కరూ అవలంభించాలని డాక్టర్ ఖాదర్ వలీ పిలుపునిచ్చారు. చిరుధాన్యాలు ( మిల్లెట్స్) తో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. అలాగే చిరుధాన్యాలతో తయారు చేసిన అంబలిని తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలను వివరించారు. 

ప్రస్తుతం అందుబాటులో ఉంటున్న ఆహారానికి దూరంగా ఉండాలని.. మిల్లెట్స్ ను భాగంగా చేసుకోవాలని డాక్టర్ ఖాదర్ వలీ కోరారు. ఆస్పత్రికి వెళ్లకుండా ఉండాలంటే సమతుల్య ఆహారం తినడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. అందరూ సరైన ఆహార నియమాలు పాటించడం మంచిదని సూచించారు.

 


© 2023 - 2025 Millets News. All rights reserved.