మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మిల్లెట్స్ తినాల్సిందే..!!

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మిల్లెట్స్ తినాల్సిందే..!!

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మిల్లెట్స్ తినాల్సిందే..!!

 

చిరుధాన్యాలు (మిల్లెట్స్)  ఎన్నో పోషకాలతో నిండి ఉన్నాయన్న విషయం తెలిసిందే. మంచి ఆరోగ్యం కోసం వీటిని ఆహారంగా తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో భాగంగా మన మెదడు పనితీరులో మిల్లెట్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తి, శ్రద్ధ పెరుగుదలకు దోహదపడుతుంది.

మెదడు ఆరోగ్యంగా ఉండటంలో చిరుధాన్యాలు పోషించే పాత్రపై సెలియాక్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కోయలిషన్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్, ఇల్నెస్ టు వెల్నెస్ సహకారంతో సెమినార్ నిర్వహించి.. చర్చించారు. మానసిక చురుకుదనాన్ని పెంచడంతో మిల్లెట్స్ ద్వారా చేకూరే ప్రయోజనాలను డాక్టర్ వినోద్ కుమార్ పాల్, డాక్టర్ మీనా మిశ్రా మరియు ఇషి ఖోస్లా వివరించారు. డాక్టర్ చంద్రకాంత్ పాండవ్ కూడా హాజరైన ఈ సమావేశంలో మిల్లెట్స్ ఉత్పత్తికి భారతదేశం అందిస్తున్న సహకారాన్ని వెల్లడించారు. పోషకాహార లోపాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరిష్కారంలో గట్ ఆరోగ్యం కీలక పాత్రపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చ జరిగింది. చిరుధాన్యాల వినియోగంపై అవగాహన పెంచడంతో పాటు భోజన తయారీలో ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించడం వంటి అంశాలను వివరించారు. చిరుధాన్యాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం, విధాన మార్పులపై మాత్రమే ఆధారపడటం కంటే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. .

ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్, సమకాలీన పోషక సవాళ్లను పరిష్కరించడంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లను తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తూ.. పోషక పదార్థాలు అధికంగా ఉండే మిల్లెట్స్ వంటి ఆహారాన్ని తీసుకోవాలని వెల్లడించారు. అదేవిధంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా తెలిపారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా చోటు చేసుకునే పరిణామాలను ఆమె హైలైట్ చేశారు. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నాలుగు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్న ఆమె వాటిని వివరించారు. అవి గట్ ఆరోగ్యం, నడుము నిర్వహణ, గ్లూటెన్, మరియు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలని పేర్కొన్నారు. 

జీవితంలోని వివిధ దశల్లో జ్ఞాపకశక్తి అంశంపై చిరుధాన్యాలు చూపించే ప్రభావాలను బ్రెయిన్ బిహేవియర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ డాక్టర్ మీనా తెలుసుకున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు మెండుగా ఉన్న చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన అల్జీమర్స్, జ్ఞాపక శక్తి నశించడం వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని ఆమె తెలిపారు. 
అదేవిధంగా చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు వృద్ధులలో జ్ఞాపకశక్తి క్షీణించడంతో సంబంధం కలిగి ఉన్నాయని సూచించే పరిశోధనలన డాక్టర్ మిశ్రా హైలైట్ చేశారు. దాంతో పాటుగా ప్రపంచ మిల్లెట్ ఉత్పత్తిలో భారతదేశం ముఖ్యమైన పాత్రను మాజీ కేంద్రమంత్రి మీనాక్షి లేఖీ వెల్లడించారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో ఐదవ వంతు ఉందన్న ఆమె మంచి ఆహారం ఔషధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు కమ్యూనిటీ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ పాండవ్, లివర్ మరియు జీఐ పాథాలజీలో ప్రత్యేకత కలిగిన డా. అర్జున్ డాక్టర్ కపిల్ యాదవ్ పాల్గొన్నారు.


© 2023 - 2024 Millets News. All rights reserved.