భారతదేశంలో చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను తగ్గించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటికీ సమస్య పూర్తిగా తొలగిపోలేదు. అయితే అస్సాం లోని కొన్ని పాఠశాలలో అక్కడి అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో చిరు ధాన్యాల ఆహారం ఇవ్వాలి అని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి శైలేంద్ర ప్రసాద్ మరియు అస్సాం మిల్లెట్ మిషన్ పర్సనల్ శుభంకర్ రాయ్ పాల్గొన్నారు. చిన్న వయసు నుండే పిల్లలకు చిరు ధాన్యాలు అందించడం వలన వారికి జింక్, కాల్షియం విటమిన్ బి 3 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి అని వారు అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన చిరు ధాన్యాల ఆహారం గురించి కూడా ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు.
ఇది అస్సాం మిల్లెట్ మిషన్ లో భాగమని ఆయన తెలిపారు. అస్సాం మిల్లెట్ మిషన్ 2022 సంవత్సరం నుండి 2029 వరకూ ఏడు సంవత్సరాల పాటు కొనసాగనున్నది. అస్సాం మిల్లెట్ మిషన్ పథకాన్ని నవంబర్ 16, 2022 తేదీన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పథకం 15 జిల్లాల్లో అమలు అవుతుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.