చాలామంది ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించాలని చిరుధాన్యాలని వాళ్ళ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఈ చిరుధాన్యాలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. నిత్యం మనకి 25 నుండి 30 గ్రాముల పీచు పదార్థం కావాల్సి ఉంటుంది. చిరుధాన్యాలను కనుక తీసుకున్నట్లయితే కావలసినంత పీచు మనకి అందుతుంది. అందుకనే దీనిని సూపర్ ఫుడ్ గా చెప్తారు. గోధుమలు, వరి వంటి వాటి పొట్టు తీసేస్తూ ఉంటారు. సో. పీచు పదార్థం దాదాపుగా పోతుంది. అందుకని ఈ చిరుధాన్యాలని తీసుకోవడం మంచిది. ఈ చిరుధాన్యాలలో పీచు పదార్థం లోపలి పొరల్లో కూడా ఉంటుంది. పుష్కలంగా పీచు పదార్ధం మనకి అందుతుంది.
ఇక ఇప్పుడు ఏ వ్యాధుల వాళ్ళు ఎటువంటి చిరుధాన్యాలను తీసుకుంటే మంచిదనే విషయాన్ని చూసేద్దాము. రక్త శుద్ధి, ఎముకల గుజ్జు సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు అరికలు (Kudo Millets) తీసుకున్నట్లయితే చక్కటి ఉపయోగం ఉంటుంది. అలానే అరికలు తీసుకోవడం వలన ఆస్తమా, మూత్రపిండాల వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, పేగులు అలానే క్లోమ గ్రంధి సమస్య, కాలేయ సమస్యలు, కాలేయ క్యాన్సర్ తో పాటుగా డయాబెటిస్, టైఫాయిడ్, వైరల్ ఫీవర్, డెంగ్యూ సమస్యలు కూడా తగ్గిపోతాయి. కొర్రలు (Foxtail Millets) లో ఎనిమిది శాతం పీచు పదార్థం తో పాటుగా, కొర్రల్లో 12% ప్రోటీన్స్ ఉంటాయి.
గర్భిణీలు కొర్రలను తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలలో వచ్చే మలబద్ధకాన్ని సులువుగా పోగొడుతుంది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వస్తూ ఉంటుంది ఆ టైంలో మూర్ఛ కూడా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అటువంటి మూర్చ పిల్లల్లో కొన్నాళ్ల దాకా ఉంటుంది. కొర్రలను తీసుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు. కొర్రలని తీసుకోవడం వలన నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ సమస్యలు, నరాల బలహీనత, ఆస్తమా వంటి సమస్యలు వారికి ఉపయోగంగా ఉంటాయి. ఊదలు విషయానికి వచ్చేస్తే, డయాబెటిస్ ఉన్నవాళ్లు ఊదలను తీసుకోవడం వలన డయాబెటిస్ తగ్గుతుంది. థైరాయిడ్, క్లోమ గ్రంధి సమస్యలు ఉన్నవాళ్లు కూడా తీసుకోవడం మంచిది.
లివర్, గర్భాశయ క్యాన్సర్లను తగ్గించేందుకు కూడా ఊదలు సహాయం చేస్తాయి. అండు కొర్రలు (Brown Top millets ) కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వివిధ రకాల సమస్యలు దూరం చేయగలవు. మొలలు, అల్సర్లు, మెదడు, రక్తం, ఎముకలు, జీర్ణాశయం, పేగులు, చర్మ సమస్యలు వంటి సమస్యలు ఉన్నవాళ్లు అండు కొర్రలు తీసుకోవడం వలన ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఏ మిల్లెట్స్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదా..? ఈ సమస్యల నుండి బయటపడడానికి ఈ మిల్లెట్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి మరింత ఆరోగ్యంగా ఉండండి. మిల్లెట్స్ ని వండుకోవడం కూడా ఈజీయే. మనమేం పెద్దగా కష్టపడక్కర్లేదు ఈ రోజుల్లో చాలామంది మిల్లెట్స్ ని డైట్ లో చేర్చుకుంటున్నారు. మీరు కూడా మరి ఈరోజు మొదలు పెట్టేయండి. వివిధ రకాల సమస్యల నుండి సులభంగా బయటపడండి.
© 2023 - 2024 Millets News. All rights reserved.