మిల్లెట్స్ వాడకం పట్ల అవి అందించే ప్రయోజనాల పట్ల అవగాహన పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చిరు ధాన్యాల పట్ల శ్రద్ధ తీసుకుని వివిధ ప్రోత్సాహకాలు అందిస్తుంది. మిల్లెట్స్ ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలి అని ప్రారంభించిన స్టార్టప్ “ మిల్లెట్ మార్వెల్స్ “ తాజాగా వారి ఎక్పీరియన్స్ హబ్ (Millet Experience hub) ను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక్కడ ప్రత్యేకంగా మిల్లెట్స్ తో తయారు చేసిన చాట్ ను ప్రజలు రుచి చూడవచ్చు అని కార్డియాలజిస్ట్ మరియు యాక్టర్ భరత్ తెలిపారు.
హైదరాబాద్ లోని డాన్ బాస్కో నగర్ లో ఈ మిల్లెట్ ఎక్పీరియన్స్ హబ్ (Millet Experience hub) ను భరత్ ప్రారంభించారు. మిల్లెట్ మార్వెల్స్ గత మూడు సంవత్సరాల నుండి వరసగా కేంద్ర ప్రభుత్వం నుండి పోషక్ ఆవాజ్ అవార్డును అందుకుంది. అలాగే బెస్ట్ ఇండియన్ మిల్లెట్ కిచెన్ బిరుదు కూడా పొందింది. డాన్ బాస్కొ నగర్ లో ప్రారంభమైన ఈ హబ్ లో వినియోగదారులు మిల్లెట్స్ వంటకాలను రుచి చూడడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంది అని ఈ కార్యక్రమంలో తెలిపారు.
సాధారణంగా అందరూ బియ్యం లేదా గోధుమలతో చేసిన ఆహార పదార్థాలకు అలవాటు పడిన వారు త్వరగా చిరు ధాన్యాల ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ చిరు ధాన్యాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి వీటిని రుచికరంగా తయారు చేస్తే అందరూ ఇష్టపడతారు అనే ఉద్దేశంతో మిల్లెట్ మార్వెల్ స్టార్టప్ పని చేస్తుంది.
అలాగే నేటి జనరేషన్ యూత్ కు ఈ ఆహారం చాలా అవసరం అని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అని మిల్లెట్ మార్వెల్ మెంటార్ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ తో సహా మరో ఏడు ప్రాంతాల్లో వచ్చే నెల రోజుల్లో మిల్లెట్ మార్వెల్ ఔట్ లెట్ లను ప్రారంభించనున్నట్లు కూడా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.