మిల్లెట్స్ తో ఐస్ క్రీమ్, తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో కూడా లభ్యం.

మిల్లెట్స్ తో ఐస్ క్రీమ్, తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో కూడా లభ్యం.

మిల్లెట్స్ తో ఐస్ క్రీమ్, తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో కూడా లభ్యం.

ప్రస్తుతం ప్రపంచదేశాల్లో చిరు ధాన్యాల పట్ల అవగాహన పెరుగుతుంది, దానితో పాటే కొత్త కొత్త ఆలోచనలతో స్టార్టప్ లు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో హైదారాబాద్ లో ఆరంభం పేరుతో మిల్లెట్స్ రెస్టారెంట్ ను నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగాలు చేసుకుంటున్న నలుగురు స్నేహితులు వారి ఉద్యోగాలు వదిలేసి చిరు ధాన్యాలతో తయారు చేసిన వీగన్ ఫ్రెండ్లీ ఐస్ క్రీమ్ ను అందిస్తున్నారు. ఈ మిల్లెట్స్ ఐస్ క్రీమ్ కు “ సిరి ఐస్ క్రీమ్” అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ సిరి ఐస్ క్రీమ్ ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలకు అందుబాటులో ఉంది. 

తమిళనాడుకు చెందిన ప్రభు వేణుగోపాల్, శశిధర్ తో పాటు హైదరబాద్ కు చెందిన అరుణ్ ప్రకాష్ , భార్గవ్ కలిసి ఈ వీగన్ ఐస్ క్రీమ్ ను ప్రారంభించారు. 2020 సంవత్సరంలో వీరు ఈ ఐస్ క్రీమ్ ను ప్రారంభించగా ప్రస్తుతం నాలుగు ఔట్ లెట్ ఉన్నాయి అని తెలిపారు. అసలు పెద్ద ఎత్తున సిరి ఐస్ క్రీమ్ ను ప్రారంభించాలి అనుకున్నా కూడా ఆ సమయంలో కోవిడ్ 19 ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారు అనుకున్నట్లు జరగలేదు అని అన్నారు. భారతదేశంలో చిరు ధాన్యాలు బాగా పండుతాయి అయితే గత కొంత కాలంగా వీటిని మనం పెద్దగా పట్టించుకోలేదు. 

ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిల్లెట్ పంటలు, మిల్లెట్ ప్రమోషన్ మీద దృష్టి సారించడం తో చిరు ధాన్యాల ఉత్పత్తి అలాగే వాడకం కూడా బాగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ మండలానికి చిరు ధాన్యాలను అందించడానికి www.millets.news అనే వెబ్సైట్ కూడా ప్రారంభించబడింది. తాజాగా మిల్లెట్ తో చేసిన సిరి ఐస్ క్రీమ్ కూడా ప్రజల్లో ప్రాచుర్యం పొందుతోంది. 


© 2023 - 2024 Millets News. All rights reserved.