మిల్లెట్స్ డిజిటల్ ఎగ్జిబిషన్ లాంచ్ చేసిన గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్

మిల్లెట్స్ డిజిటల్ ఎగ్జిబిషన్ లాంచ్ చేసిన గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్

మిల్లెట్స్ డిజిటల్ ఎగ్జిబిషన్ లాంచ్ చేసిన గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్

భారతదేశంలో చిరు ధాన్యాల ప్రాముఖ్యత గత కొంత కాలంగా విస్తరిస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అనేక రకాలైన వ్యాధులను నియంత్రించడానికి చిరు ధాన్యాలు సహాయపడతాయి. అందుకే చిరు ధాన్యాల గురించిన సమాచారం సమగ్రంగా అందించడానికి భారతదేశ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ సహకారంతో “ మిల్లెట్స్ సీడ్స్ ఆఫ్ చేంజ్” అనే పేరుతో డిజిటల్ ఎగ్జిబిషన్ (Millets Exhibition)ను గూగుల్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భారతదేశ వ్యవసాయ శాఖ మరియు రైతుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ (Google Arts and Culture) డైరెక్టర్ అమిత్ సూద్ పాల్గొన్నారు. భవిష్యత్తులో చిరు ధాన్యాలు ప్రపంచమంతటా ముఖ్య పాత్ర పోషిస్తాయి అని అమిత్ సూద్ అన్నారు. 

భారతదేశ వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా మాట్లాడుతూ మిల్లెట్స్ ను ప్రపంచ ఆహార చాంపియన్ గా చేయడంలో భారతదేశం ముందు ఉండి నడిపిస్తుంది అని అన్నారు. ఇప్పటికే చిరు ధాన్యాలను పండించే రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం పూనుకున్నది. అంతే కాకుండా మిల్లెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తారంగా ప్రమోట్ చేస్తున్నారు. 

ప్రస్తుతం గూగుల్ ప్రారంభించిన మిల్లెట్స్ డిజిటల్ ఎగ్జిబిషన్ ను Google arts and Culture వెబ్సైట్ ద్వారా వీక్షించవచ్చు. ఇందులో మిల్లెట్ పూర్వాపరాలు, పరిణామ క్రమం, మిల్లెట్ వంటకాలు మొదలైన సమాచారం ఉంటుంది. 


© 2023 - 2024 Millets News. All rights reserved.