చిరు ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచిన భారత్.

చిరు ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచిన భారత్.

చిరు ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచిన భారత్.

 

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చిరు ధాన్యాల వినియోగం ఎక్కువ అయ్యింది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటించి చిరు ధాన్యాల విలువను తెలియజేసింది. అయితే అన్ని దేశాలకంటే ముందుగా భారతదేశం చిరు ధాన్యాల డిమాండ్ ను గుర్తించి ఉత్పత్తిని ప్రారంభించింది. అంతే కాకుండా భారతదేశంలో చిరు ధాన్యాల ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు ప్రోత్సాహకాలు అందిస్తూ ఉండడంతో ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఐతే మిల్లెట్స్ ను పండించే రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించడం రైతులకు కలసి వస్తుంది. 


చిరు ధాన్యాల ఉత్పత్తి విషయానికి వస్తె ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వీటిని పండిస్తున్న అప్పటికి కూడా భారతదేశం 1,09,10,000 టన్నుల చిరు ధాన్యాలు పండిస్తూ మొట్ట మొదటి స్థానంలో ఉంది. ఇక భారతదేశం తర్వాత నైజీరియా 50,00,000 టన్నుల మిల్లెట్స్ పండిస్తూ రెండవ స్థానంలో ఉంది. భారత్, నైజీరియా తర్వాతి స్థానాల్లో నైగర్, చైనా, మాలి , బుర్కినా ఫాసో, సూడాన్, ఇథియోపియ, చాడ్ , సెనెగల్ వరస క్రమంలో టాప్ 10 లో ఉన్నాయి. 

భారతదేశంలో పండే చిరు ధాన్యాలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సాధారణ రైతులు కూడా చిరు ధాన్యాలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో చిరు ధాన్యాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే మిల్లెట్స్ వ్యవసాయం క్రమక్రమంగా పెరుగుతుంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశాన్ని న్యూట్రీషియన్ హబ్ గా మారుస్తామని దానికి తగ్గట్టుగా రైతులకు సహాయం చేస్తామని వెల్లడించారు. 


© 2023 - 2024 Millets News. All rights reserved.