ఇకపై పాఠశాలల్లో , ఇందిరా క్యాంటీన్లలో మిల్లెట్స్ తో చేసిన ఆహారం అందిస్తాం : కర్ణాటక సీఎం సిద్దా రామయ్య

ఇకపై పాఠశాలల్లో , ఇందిరా క్యాంటీన్లలో మిల్లెట్స్ తో చేసిన ఆహారం అందిస్తాం : కర్ణాటక సీఎం సిద్దా రామయ్య

ఇకపై పాఠశాలల్లో , ఇందిరా క్యాంటీన్లలో మిల్లెట్స్ తో చేసిన ఆహారం అందిస్తాం : కర్ణాటక సీఎం సిద్దా రామయ్య

కర్ణాటక రాష్ట్రంలోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దా రామయ్య ( Siddha Ramaiah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్స్ మరియు ఆర్గానిక్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (Millets and Organic International Trade Fair) 2024 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా మిల్లెట్స్ తో చేసిన ఆహారం అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఇందిరా క్యాంటీన్ లలో కూడా మిల్లెట్స్ ను అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు విషయాల పై త్వరలోనే చర్చించి అమలు చేస్తామని అన్నారు.

రాష్ట్రంలోని ఇందిరా క్యాంటీన్ ( Indira Canteen) లలో చిరు ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తక్కువ ధరకు అందిస్తాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని ద్వారా తక్కువ ధరకే పేదలకు చిరు ధాన్యాల ఆహారం లభిస్తుంది అన్నారు. చిరు ధాన్యాలను అందించడం ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రజలు మరింత ఆరోగ్యంగా , దృఢంగా ఉంటారు అని కూడా అన్నారు. 


కర్ణాటక ప్రభుత్వంతో పాటుగా మిగిలిన రాష్ట్రాలు కూడా మిల్లెట్స్ ఉత్పత్తి మరియు వినియోగం పైన దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు చిరు ధాన్యాలను అందించే విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. సాధారణ ధాన్యాలతో పోలిస్తే మిల్లెట్స్ లో అధికంగా ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉండడంతో ఇవి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులు రాకుండా నియంత్రిస్తాయి. వివిధ రాష్ట్రాల రైతులు కూడా సాంప్రదాయిక పంటలకు బదులుగా చిరు ధాన్యాలను పండించడం వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా చిరు ధాన్యాలను ప్రజలకు అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్దా రామయ్య వెల్లడించారు. 


© 2023 - 2024 Millets News. All rights reserved.