వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నారా? ఈ మిల్లెట్స్ తింటే సులభంగా బరువు తగ్గవచ్చు.

వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నారా? ఈ మిల్లెట్స్ తింటే సులభంగా బరువు తగ్గవచ్చు.

వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నారా? ఈ మిల్లెట్స్ తింటే సులభంగా బరువు తగ్గవచ్చు.

 

ఎన్ని ఏళ్లు గడిచినా ప్రతి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లో ఒక్క రెజల్యూషన్ మాత్రం ఎప్పటికీ మారదు. అదే బరువు తగ్గాలి అని అనుకోవడం.అనుకున్నంత ఈజీ కాదు బరువు తగ్గడం అంటే. నేడు మార్కెట్లో కూడా చాలా పద్ధతులు వచ్చేసాయి. ప్రతిరోజు ఒక గంట మా క్లినిక్ లో గడిపారు అంటే నెలలో ఐదు కేజీలు తగ్గుతారంటూ ఎప్పుడూ ఏదో ఒక ప్రకటన మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ మొదట్లో బాగానే ఫలితాన్ని ఇవ్వచ్చు కానీ ఏదో ఒక సమయంలో ఫలితాలు తప్పకుండా ఆగిపోతాయి. అంతేకాదు అదనంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా సరే నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడమే సరైనది.

బరువు తగ్గడం కోసం డైట్ పేరుతో పస్తులు ఉండటం చాలా తప్పు. సరైన ఆహారాన్ని తినాలి అది కూడా మితంగా తినాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి అనుకున్న వారు తప్పకుండా పాలిష్ చేయబడిన అలాగే ప్రాసెసెడ్ ఫుడ్ కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పాలిష్ చేసిన తెల్లటి బియ్యాన్ని తిన్నన్ని రోజులు మీకు ఎలాంటి ఫలితాలు లభించవు.మరి ఏం తినాలి…?

ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.చిరుధాన్యాల లో ఫైబర్ ఎక్కువ గా ఉంటుంది.అందులోనూ బరువు తగ్గాలి అని అనుకునే వారు కొర్రలను మీ ఆరోగ్యం లో భాగం చేసుకోవాలి. ఫైబర్,ప్రోటీన్ అలాగే ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్న ఈ కొర్రలు ( Foxtail Millets) మన జిర్ణశ్రయం లో చాల మెల్లగా జీర్ణం అవుతాయి.అలా అవ్వడం కారణంగా మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది.ఇలా కలగడం ద్వారా మన ధ్యాస వేరే చిరు తిండ్ల పై కి వెళ్లకుండా ఉంటుంది.అలాగే రక్తం లో చక్కర స్థాయి కూడా పెరగకుండా ఉంటుంది.అలా కాకుండా కేవలం కార్బోహైడ్రేట్స్,ఫాట్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా అవి మన జీర్ణాశయం లో త్వరగా జీర్ణం అయ్యి,వెంటనే రక్తం లో కి చెక్కర నీ విడుదల చేస్తుంది. ఆప్పుడు వెంటనే ఆకలి వెయ్యడం తో పాటు,షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి.

కేవలం డైట్ లో మార్పులు చేయడం మాత్రమే కాదు వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం.ఈ కొర్రలు తినడం ద్వారా చాలా ఆక్టివ్ గా ఉంటాం. ఆప్పుడు రెట్టింపు ఉత్సాహంతో వ్యాయామం చెయ్యగలం.

అలా కొర్రలను ఆహారం లో భాగం చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.


© 2023 - 2024 Millets News. All rights reserved.