చిరుధాన్యాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అందరూ చెబుతూ ఉంటారు. చాలామంది చిరుధాన్యాల వల్ల కేవలం రెండు ఉపయోగాలు మాత్రమే ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. కొందరేమో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అని అంటే మరికొందరేమో చక్కెర వ్యాధి నియంత్రణలో ఉండడానికి ఉపయోగపడుతుంది అని అంటారు. దాదాపు 90 శాతం మంది ఇవే సమాధానాలు చెబుతారు. కానీ చిరుధాన్యాల వల్ల ఇంతకంటే ఎక్కువ ఉపయోగాలే ఉన్నాయి. చిరుధాన్యాలు కేవలం బరువుని అలాగే చక్కెర వ్యాధిని అదుపు చేయడం మాత్రమే కాకుండా మరికొన్ని తీవ్రమైన వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
మన దేశంలో 30 లక్షల మంది ఆస్తమా తో ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఇటీవలే జరిగిన ఒక సర్వేలో తేలింది. ఇందులో దాదాపు పది లక్షల మంది 10 ఏళ్లలోపు పిల్లలు ఉండటం మనం గమనించాలి. చాలామంది పిల్లలు పుడుతూనే ఆస్తమా వ్యాధిని కలిగి ఉంటూ ఉన్నారు. ఇక ఆస్తమా వ్యాధి కలిగి ఉన్న ముసలివారైతే చలికాలంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉన్నవారు అరికెలను ( kodo millets) తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించుకోవచ్చు. అరికెలలో అధిక శాతం మెగ్నీషియం ఉంటుంది. ఈ అరికెలలో ఉండే పొటాషియం శరీరంలో రక్త పోటుని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ మెగ్నీషియం మూసుకున్న శ్వాస నాళాలను తెరవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే వాటిని రిలాక్స్ చేస్తుంది. అలాగే వాయునాళాల్లో ఏదైనా మంట ఏర్పడితే ఈ మెగ్నీషియం వాటిని ఆపే ప్రయత్నం చేస్తుంది.
సోరియాసిస్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చినవారు కేవలం వ్యాధితో మాత్రమే కాకుండా సమాజంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. చాలామంది ఈ వ్యాధితో బాధపడేవారు ఇంటి నుండి బయటకు రావడానికి కూడా నామోషీగా భావిస్తూ ఉంటారు. ఇది ఒక్కసారి వస్తే శరీరమంతా పాకుతుంది. దీనిని నియంత్రించడం చాలా కష్టం. సోరియాసిస్ ని నియంత్రించాలి అంటే సరైన డైట్ ప్లాన్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఉప్పు కారం నూనెలు కు ఎంత దూరం ఉంటే ఈ వ్యాధి భారినుండి అంత త్వరగా బయటపడవచ్చు. సోరియాసిస్ మాత్రమే కాదు ఎగ్జిమా ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ని కూడా దూరం చేసుకోవాలి అంటే మిల్లెట్స్ ని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు వారు చాలావరకు బియ్యం గోధుమలు చక్కెర మైదా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఈ ఆహారాన్ని తీసుకుంటే వ్యాధి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందులోనూ స్కిన్ ప్రాబ్లమ్స్ ని దూరంగా ఉంచుకోవాలి అంటే కొర్రలను ( Foxtail Millets) తప్పక తినాల్సి ఉంటుంది. ఈ కొర్రలలో నియాసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ పదార్థం ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే చర్మవ్యాధులను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
కేవలం కొర్రలు మాత్రమే కాదు అరికెలు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. ఇవి అలర్జీలను తగ్గిస్తాయి. అలాగే కొలజన్ శాతాన్ని పెంచి అందమైన చర్మాన్ని అందిస్తుంది.
క్యాన్సర్ కూడా ఒక ప్రాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కేవలం కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. సరైన చికిత్స మరియు సరైన ఆహార అలవాట్లు ద్వారా ఈ వ్యాధి రాకుండా నియంత్రించుకోవచ్చు. మన శరీరంలో ఏ భాగమైన క్యాన్సర్ బారిన పడవచ్చు, క్యాన్సర్ వ్యాధిని తగ్గించుకోవాలి అని అన్నా లేక భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అన్నా సజ్జలను (Pearl millets ) ఆహారంలో భాగం చేసుకోవాలి.
పొట్టు తీయబడిన సజ్జలలో ఫెనోలిక్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం కలిగిన ఈ మిల్లెట్ మన శరీరంలోకి వెళ్లి యాంటీ క్యాప్సినాజిక్ ప్రాసెస్ ని మొదలు పెడుతుంది. అంటే క్యాన్సర్ కణాల్ని మెల్లమెల్లగా చంపుతూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉన్నవారు తప్పకుండా ఈ సజ్జలను తినడం ద్వారా వ్యాధిని తగ్గించుకోవచ్చు. ఎవరైతే ప్రతినిత్యం సజ్జలను తమ ఆహారంలో భాగంగా చేసుకొని ఉంటారు వారు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు.
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు గుండె ఆరోగ్యంగా ఉండాలి. చాలామంది సెలెబ్రెటీస్ జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తూ ప్రాణాలు విడిచారు అన్న వార్తని మనం వినే ఉంటాం. దీనికి ప్రధాన కారణం గుండె ఆరోగ్యంగా లేకపోవడం. అంటే గుండెపై ఎక్కువ ప్రెషర్ పడడం. సాధారణంగా చాలామంది ఎలాంటి ఆహారాన్ని తిన్న సరే వ్యాయామం చేస్తే చాలు పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండవచ్చు అని అనుకుంటారు. కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తినడం ద్వారా గుండె నాళాలు బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ వ్యాయామాలు చేయడం ద్వారా కొన్నిసార్లు గుండెపై ప్రెషర్ పడుతుంది. ఇలాంటి సమయంలో గుండె ఆగిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. వ్యాయామం చేయాలి అంటే అందుకు తగ్గ సరైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అన్ని రకాల చిరు ధాన్యాలు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అందులోనూ సజ్జలు, జొన్నలు, కొర్రలు బాగా ఉపయోగపడతాయి.
© 2023 - 2024 Millets News. All rights reserved.