చిరుధాన్యాలలో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో భాగంగా పోషకాలతో నిండి ఉన్న మల్టీగ్రెయిన్ పిండితో చేసే ఆహారాన్ని తినడం వలన అనేక ప్రయోజనాలు చేకూరతాయి. మిల్లెట్స్ పిండి గ్లూటెన్ -ఫ్రీ మరియు ఫైబర్, కాల్షియం, ప్రోటీన్ కలిగి ఉంటుంది. అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
మల్టీగ్రెయిన్ పిండిని వివిధ ధాన్యాల పిండి మిశ్రమమని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా గోధుమలు, బార్లీ, మినుములు వంటి పిండిని కలుపుతారు. మొత్తం గోధుమ పిండి కాకుండా మిల్లెట్( రాగి పిండి, జోన్నలు, వైట్ మిల్లెట్ పిండి లేదా బజ్రా పిండి), సోయాబీన్ పిండి, వోట్స్ కలుపుకోవాలి. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ పిండితో తయారు చేసిన రోటీలను తినడం వలన బరువు నియంత్రణలో ఉండటంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ క్రమంలో మల్టీగ్రెయిన్ పిండి రోటీ లేదా చపాతీలను తయారు చేసే విధానాన్ని మనం తెలుసుకుందాం.
కావాలిసిన పదార్థాలు:
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో పైన పేర్కొన్న గోధుమ పిండితో పాటు ఇతర పిండిని వేసి బాగా కలపాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీరును చేరుస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండి ముద్దను మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. తరువాత పిండి ముద్ద నుంచి చిన్న పరిమాణంలో తీసుకుని గుండ్రంగా చపాతీ తరహాలో వత్తుకోవాలి. అనంతరం వీటిని సన్నని మంటపై కాల్చుకోవాలి. అంతే వేడి వేడి రోటీలు రెడీ.
© 2023 - 2024 Millets News. All rights reserved.