కొర్రలును సూపర్ ఫుడ్ అని పిలవడానికి 5 ముఖ్యమైన కారణాలు ఇవే.

కొర్రలును సూపర్ ఫుడ్ అని పిలవడానికి 5 ముఖ్యమైన కారణాలు ఇవే.

కొర్రలును సూపర్ ఫుడ్ అని పిలవడానికి 5 ముఖ్యమైన కారణాలు ఇవే.

 

చిరుధాన్యాల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కో ధాన్యం మనకు ఒక్కో రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. చిరుధాన్యాలలో ముఖ్యమైనది కొర్రలు. కొర్రలను తినడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. చాలామంది  డైటీషియన్లు అలాగే న్యూట్రిషనీస్ట్ కొర్రలను ఆహారములో తరచుగా తీసుకోమని చెబుతూ ఉంటారు..

ఈ కొర్రల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఈ కొర్రలను ఎందుకు సూపర్ ఫుడ్ గా పిలుస్తారో తెలుసుకుందాం.

1 అనిమియా నీ తగ్గిస్తుంది

      ఈమధ్య చాలా మంది స్త్రీలు  ఆనీమియా (Anemia ) వ్యాధి తో బాధ పడుతూ ఉంటారుు. కొందరికి హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి.అలాగే ఐరన్ డెఫిషియన్సీ తో బాగా బాధపడుతూ ఉంటారు. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ తూ ఉన్నారు అలాంటివారు ప్రతిరోజు కొర్రలను ( Foxtail Millets) తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా అనీమియా వ్యాధిని పూర్తిగా దూరం చేసుకోవచ్చు. ఐరన్ డెఫిషియన్సీ కి కూడా చెక్ పెట్టవచ్చు.

2 శరీరానికి కావాల్సిన B12 అందిస్తుంది

       కొందరికి అరిచేతులు మరియు అరికాళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటాయి. అరికాళ్ళ మంటలతో కొందరైతే నడవలేకపోతుంటారు. ఇక అరిచేతులనేమో ఎవరో సేఫ్టీ పిన్ తో గుచ్చినట్టు అనిపి స్తుంది. తొందరగా కోపం వస్తూ ఉంటుంది, మూడు స్వింగ్స్ అధికంగా ఉంటాయి. కంటి చూపు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువ నీరసం ఎక్కువ ఆయాసం కూడా ఉంటుంది. వీటన్నిటికీ కారణం శరీరంలో బి12 లోపం ఉండటం.అంతే కాదు B12 లోపం కాస్త ఎక్కువ అయితే ఆ వ్యక్తికి ఆల్జీమర్స్ వ్యాధి కూడా వస్తుంది. ఇన్ని వ్యాధులకు దూరంగా ఉండాలి అంటే మన శరీరానికి బి12 చాలా అవసరం. కొర్రలను ప్రతిరోజు ఏదో ఒక పూట ఆహారముగా తీసుకుంటే ఈ బి12 సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు శాకాహారులు కూడా బి12 ఎటువంటి కొర్రలు ( Foxtail Millets) తినడం ద్వారా పొందవచ్చు

3 చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది

వ్యాధులన్నీ ఒక ఎత్తు అయితే ఈ చక్కర వ్యాధి మరో ఎత్తు. ఒక్కసారి వచ్చిందంటే దీనిని తగ్గించుకోవడం చాలా కష్టం. కానీ ఈ కొర్రలను తినడం ద్వారా చక్కెర వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. సాధారణంగా చక్కర వ్యాధి ఉన్నవారు ఎక్కువసేపు ఆకలితో ఉండలేరు. ఈ కొర్రలను తినడం ద్వారా వీటిలో ఉన్న అధిక ఫైబర్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. తద్వారా మనం ఎక్కువ ఆహారం తినకుండా ఉంటాం. ఎప్పుడైతే ఎక్కువ ఆహారం తింటామో అప్పుడు గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. తక్కువ ఆహారం అది కూడా పోషకాలతో నిండిన ఆహారాన్ని తినడం ద్వారా గ్లూకోస్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు

4 గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది

 గుండె ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునేవారు తప్పకుండా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అధిక బిపి తో ఇబ్బంది పడుతూ ఉన్నవారు కచ్చితంగా కొర్రలను తినాలి. అప్పుడే భవిష్యత్తులో గుండెకి సంబంధించిన ఎలాంటి వ్యాధి తలెత్తకుండా ఉంటుంది. గుండెకు సంబంధించిన చికిత్సలు చేయించుకున్న వారు అలాగే సర్జరీలు చేయించుకున్న వారు తప్పకుండా ఆహారంలో కొర్రలను ( Foxtail Millets) ఉపయోగించాలి. అప్పుడే వారి ఆరోగ్యం త్వరగా మెరుగు పడుతుంది. గుండె బలంగా తయారవుతుంది.


 5) బరువును తగ్గిస్తుంది అలాగే ఆరోగ్యమైన చర్మాన్ని అందిస్తుంది.

చాలామంది బరువు తగ్గాలి అంటే తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా తప్పు. తక్కువ ఆహారాన్ని కాదు పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోవాలి. అంటే  ఆహారంలో క్యాలరీలు తక్కువగా ఉండాలి ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండాలి. కానీ మనం ఎప్పుడూ తీసుకునే బియ్యం గోధుమలలో క్యాలరీలు అధికంగా ఉంటాయి ప్రోటీన్ ఫైబర్ తక్కువగా ఉంటాయి. అని చిరుధాన్యాలలో ఫైబరు ఎక్కువగా ఉంటుంది. అందులోనూ బరువు తగ్గాలనుకున్నవారు ముఖ్యంగా ఈ కొర్రలను తీసుకోవడం ద్వారా వారి శరీరానికి కావాల్సిన ఫైబరు అలాగే ప్రోటీన్ లభిస్తుంది. ఫైబర్ అలాగే ప్రోటీన్ కారణంగా ఆకలి తగ్గుతుంది. అప్పుడు మనకు ఎలాంటి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి. ఇలా కొర్రలతో సులభంగా బరువు నీ  తగ్గించుకోవచ్చు. తెల్లటి చర్మం కంటే ఆరోగ్యమైన చర్మం కలిగి ఉండటం ఎంతో అవసరం. ఈ కొర్రలు ప్రతిరోజు తినడం ద్వారా మన శరీరంలో ఉండే అనవసరమైన వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఎప్పుడైతే వ్యర్థ పదార్థాలు మన శరీరం నుండి వెళ్లిపోతాయి అప్పుడు మన చర్మం ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా కనిపిస్తుంది. చర్మవ్యాధులు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు.


© 2023 - 2025 Millets News. All rights reserved.