సరైన ఆహారం తీసుకోకపోవడం మరియు సరైన జీవన విధానం లేకపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు వంటివి కూడా ఎక్కువ అవుతాయి అయితే అలాంటప్పుడు కొన్ని రకాల మిల్లెట్స్ ను తీసుకోవడం వల్ల అటువంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. మిల్లెట్స్ లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు మరియు ఇతర పిండి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది కీళ్ల నొప్పుల తో బాధపడే వారు వీటిని తీసుకోకూడదు అని అపోహ పడుతూ ఉంటారు. అయితే వీటిలో ఉండేటువంటి పిండి పదార్థాలు బరువు పెరగడానికి దారి తీస్తాయని భావిస్తారు. కానీ వీటిలో ఉండేటువంటి పోషకాలు కీళ్ల నొప్పులకు సహాయపడతాయి.
రాగులు (Finger millet) మరియు సజ్జలు (Pearl millet) వాపును తగ్గించడానికి సహాయపడతాయి. రాగుల్లో ఉండేటువంటి కాల్షియం కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. సజ్జల్లో ఫాస్ఫరస్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు దానివల్ల ఎముకలు మరింత బలంగా మారతాయి. సహజంగా పాలు మరియు పాలకు సంబంధించిన పదార్థాలలో మాత్రమే కాల్షియంను అధిక శాతంలో పొందవచ్చు. అయితే డైరీ ఫ్రీ ఆహార పదార్థాల ద్వారా కాల్షియం ను పొందాలంటే మిల్లెట్స్ ఎంతో సహాయపడతాయి అని చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల అధిక మోతాదులో ఫైబర్ మరియు కాల్షియంను కూడా పొందవచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారికి మిల్లెట్స్ ఎంతో సహాయపడతాయి.
రక్తంలో సీ రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ ను తగ్గించడానికి ఇవి ఎంతో సహాయపడతాయి, దానివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ విధంగా రుమాటో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించడానికి మిల్లెట్స్ కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పవచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారికి నిద్రలేచిన వెంటనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఎముకలు ఆరోగ్యం ఎంతో అవసరం. దాంతో పాటుగా కనెక్టివ్ టిష్యూస్ మరియు కార్టిలేజ్ చాలా బలహీనంగా ఉంటాయి అలాంటప్పుడు Buckwheat వంటి మిల్లెట్స్ ను తీసుకోవడం వల్ల చాలా సహాయపడతాయి. వీటిలో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి, అంతేకాకుండా ఇవి గ్లూటెన్స్ ఫ్రీ కూడా. వీటిలో ఉండేటువంటి quercetin అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో కలిగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి మిల్లెట్స్ ను రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోండి. ఈ విధంగా కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి ఎంతో సహాయపడతాయి
© 2023 - 2025 Millets News. All rights reserved.