ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం ఎన్నో రకాల డైట్ ప్లాన్ లను పాటిస్తున్నారు. అయితే వాటిలో భాగంగా మిల్లెట్స్ డైట్ కూడా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయ్యింది. మిల్లెట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు మరియు పిండి పదార్థాలు చాలా అధికంగా ఉంటాయి. వాటి వల్ల ఎన్నో రకాల వ్యాధులను దూరం చేయవచ్చు దాంతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఎలా అయితే ప్రతిరోజూ అన్నం తీసుకుంటామో అలానే కొర్రలు (foxtail Millets), అరికలు (Kodo millet ), ఊదలు (Banyard millet ), సామలు (Little millet ), రాగులు (Finger millet) ఇటువంటి చిరుధాన్యాలను ఏదో ఒక ఆహార పదార్థంగా తీసుకోవచ్చు, అంటే వీటిని ఉపయోగించి రొట్టెలు, దోసెలు చేసుకోవడం లేదా అన్నం లా తీసుకోవాలి.
మిల్లెట్స్ లో అధిక శాతం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కొద్ది శాతం వీటిని తీసుకున్నా కడుపు నిండిపోతుంది. దాంతో తక్కువ ఆహారాన్ని తీసుకోవచ్చు. కాబట్టి అన్నం కు బదులుగా కొర్రలు (foxtail Millets) ను ఉడికించి అన్నంలా తీసుకుంటే మేలు. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రాగులు (Finger millet) తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఉండేటువంటి పాలిఫెనాల్, డయాబెటిస్ పేషెంట్స్ కు చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు మిల్లెట్స్ ను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మంచి కొవ్వులు వీటిలో అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేటప్పుడు బియ్యం మరియు గోధుమలు వంటి వాటిని తీసుకోకుండా మిల్లెట్స్ ను ఎంపిక చేసుకోవడం చాలా మేలు.
మిల్లెట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి మొదలగు సమస్యల నుండి విముక్తి పొందాలంటే క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిలో ఉండేటువంటి అమినో ఆసిడ్స్ నేచురల్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తాయి. దానివల్ల మానసిక సమస్యలు తొలగిపోతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మిల్లెట్స్ ఎంతో సహాయపడతాయి అని చెప్పవచ్చు. వీటిలో ఉండేటువంటి ఐరన్, విటమిన్ సి హేమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గిస్తాయి. కాబట్టి ఈ విధంగా మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెప్పవచ్చు
© 2023 - 2025 Millets News. All rights reserved.