మన శరీరంలో అవయవాలు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. గుండె ఏమో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటుంది. గుండె తరువాత ఎక్కువ పని చేసే అవయవం ఏదైనా ఉంది అంటే అవి కిడ్నీ లు అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. కిడ్నీలు మన శరీరంలో ఉండే చెడు పదార్థాలను ఫిల్టర్ చేసి యూరిన్ రూపం లో బయటకు పంపుతుంది. బాడీలో ఉన్న రకరకాల ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే రక్తపోటుని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. వైటమిన్ డి ని కూడా ఉత్పత్తి చేస్తుంది.
ఇన్ని పనులు చేసే కిడ్నీలకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగిన శరీరం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఒక్కరోజు కిడ్నీ పనిచేయకపోయినా సరే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కిడ్నీలు కనుక పాడు అయితే శరీరంలో వ్యర్థ పదార్థాలు విష పదార్థాలు ఎక్కువైపోతాయి. ఈ వ్యర్థ పదార్థాలు మరియు విష పదార్థాలు అంతా శరీరంలో ఉన్న రక్తంలో కలిసిపోతాయి. శరీరంలో ఉన్న రక్తంలో ఈ పదార్థాలు కలిసిపోవడం ద్వారా శరీరం త్వరగా అలిసిపోవడం జరుగుతుంది.
అన్ని పనులు సక్రమంగా జరగాలి అంటే పరిశుద్ధమైన రక్తం కలిగి ఉండటం ఎంతో అవసరం. కిడ్నీ కనుక పాడైతే వారానికి ఒక్కసారి అయినా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాలసిస్ కు చాలా ఖర్చవుతుంది. ఈ డయాలసిస్ చాలా నొప్పితో కూడుకున్న ప్రక్రియ. చాలామంది ఈ ప్రక్రియ అంటే ఎంతో భయపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ ఎదురుకోకూడదు అని అనుకుంటే తప్పనిసరిగా మనం రోజు తీసుకునే ఆహారం సరైనదై ఉండాలి.
కిడ్నీలు పాడవ్వడానికి ముఖ్య కారణాలు ఏవి..? వాటిని ఎలా అదుపు చేసుకోవాలి..?
కిడ్నీస్ పాడవడానికి ముఖ్య కారణం అధిక బరువు అధిక రక్తపోటు మరియు చక్రవ్యాధి. ఈ మూడు వ్యాధుల ద్వారా కిడ్నీలు పాడు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ముందుగా ఈ మూడు వ్యాధులకు దూరంగా ఉండాలి. ఈ మూడు వ్యాధులను సులభంగా తగ్గించుకోవాలి అంటే చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
అధిక బరువు:
చిరుధాన్యాలలో ఒకటి అయినా కొర్రలను ప్రతిరోజు ఆహారం గా తీసుకోవడం ద్వారా అధిక బరువుని సులభంగా తగ్గించుకోవచ్చు. కేవలం కోరలు మాత్రమే కాదు అన్ని చిరుధాన్యాలు బరువును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు తినడం ద్వారా మనకు విటమిన్స్ మినరల్స్ ఫైబర్ లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్క చిరుధాన్యంలో ఎంతో కొంత మోతాదులో ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్ ద్వారా మనకు శక్తి లభిస్తుంది. తద్వారా వ్యాయామాలు చేసుకోవచ్చు.
చెక్కర వ్యాధి:
అలాగే కొర్రలను రాగులను ఆరికలను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని అదుపు చేసుకోవచ్చు. రాగుల కు కూడా చక్కర వ్యాధిని అదుపు చేసే శక్తి ఉంటుంది. ఈ చిరుధాన్యలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ ఉన్న ఈ చిరుధాన్యాలని ఆహారంగా తీసుకుంటాము అప్పుడు మన జీర్ణక్రియ మెల్లగా జరగడం మొదలవుతుంది. జీర్ణక్రియ మెల్లగా జరగడం ద్వారా రక్తంలోకి చెక్కర చాలా మెల్లగా విడుదలవుతుంది. ద్వారా చక్కెర వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.
అధిక రక్తపోటు:
ఆరు వారాలు రాగులకు ఆహారంగా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటుని తగ్గించుకోవచ్చని కొన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉన్న సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ రక్తపోటు తగ్గుతుంది. గుండె కండరాలు బలంగా ఉండాలి అంటే తప్పకుండా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
అలా కిడ్నీ పాడవ్వడానికి ముఖ్య కారణాలైన అధిక బరువు, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి నీ అదుపు చేసుకోవడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
భవిష్యత్తులో కిడ్నీల కి ఎలాంటి వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి..?
కిడ్నీలు ఎప్పటికీ పాడు అవ్వకుండా ఉండాలి అంటే హై ప్రోటీన్ ఫుడ్ కి కాస్త దూరంగా ఉండాల్సి ఉంటుంది. శరీరం పనిచేయాలి అంటే ప్రోటీన్ కావాల్సి ఉంటుంది. కొంతమంది ప్రోటీన్ తింటే మంచిది అని అనుకొని శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్ ని తింటూ ఉంటారు. ఇలా తినడం ద్వారా కిడ్నీలు పాడు అయ్యే అవకాశం ఉంటుంది. తీసుకుని ఏ ఆహారమైన సరైన మోతాదులో తీసుకోవాలి. అప్పుడే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. చిరుధాన్యాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి కదా అని అనుకొని వాటిని ఎక్కువ మోతాదులో తీసుకున్న అవి కూడా ఇబ్బందిని కలిగించవచ్చు. కాబట్టి ఏ ఆహార పదార్ధమైన తీసుకోవాల్సిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి
కిడ్నీ లు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి?
*ఉప్పు కారం అధికంగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి
*ప్యాకేజ్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ప్రాసెసిడ్ మీట్ కి కూడా చాలా దూరంగా ఉండాలి.
*అధిక ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే శరీరానికి తగిన మోతాదులో మాత్రమే ప్రోటీన్ ఫుడ్ ని తీసుకోవాలి. సాధారణంగా మాంసం లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి కిడ్నీ వ్యాధులు రాకూడదు అని అనుకునేవారు మాంసాన్ని కాస్త తక్కువగా తినాల్సి ఉంటుంది. ఎప్పుడూ కేవలం అనిమల్ బేస్డ్ ప్రోటీన్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రోటీన్ ని తీసుకున్న అది సరైన మోతాదులో ఉండాల్సిన అవసరం ఉంది.
ఇలా ఆహారంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ఏవి ఎంత తినాలో అంతే తింటూ ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
© 2023 - 2024 Millets News. All rights reserved.