మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. ఎన్నో పోషకాలతో నిండిన మిల్లెట్స్ తో రకరకాల వంటలను తయారు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ‘మిల్లెట్స్ దోశ’. ఇవి రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి.
మిల్లెట్స్ పిండి షుగర్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మరీ ఈ మిల్లెట్స్ దోశను ఎలా తయారు చేసుకోవాలి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలను సుమారు పది నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే పచ్చి శనగపప్పు, కంది పప్పు, పెసర పప్పు, శనగలు, మినుములు మరియు బియ్యంను కూడా నానబెట్టుకోవాలి. తరువాత వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకుని దోశల పిండిలా కలిపి.. అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. తరువాత స్టౌవ్ మీద దోశ పాన్ పెట్టుకుని పిండిని దోశలుగా పోసుకోవాలి. కాస్త ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి. అంతే ఎంతో క్రిస్పీ మరియు రుచికరమైన దోశలు రెడీ.
© 2023 - 2025 Millets News. All rights reserved.