మిల్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2024

మిల్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2024

మిల్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2024

 

ఐఎంఎఆర్సీ గ్రూప్ తాజాగా మిల్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ -2024 అనే పేరుతో నివేదిక రూపొందించింది. ఇందులో ప్రధానంగా మిల్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను స్థాపించడానికి కావాల్సిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది.. ప్రస్తుతమున్న పరిశ్రమలు అనుసరిస్తున్న విధానం, ప్లాంట్ నిర్మాణం, పెట్టుబడి అవకాశాలు, సంస్థకు కావాల్సిన సామాగ్రి మరియు వీటికి అయ్యే ఖర్చుతో పాటు రానున్న ఆదాయం వంటి పలు అంశాలను మిల్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాజెక్ట్ రిపోర్టులో పొందుపరుస్తుంది. 

అదేవిధంగా ప్లాంట్ కు కావాల్సిన ముడిసరుకు, మౌలిక సదుపాయాలు, ప్యాకేజింగ్ మరియు రవాణా సదుపాయం వంటి మరికొన్ని వివరాలను కూడా నివేదికలో పేర్కొననుంది.  దాంతోపాటుగా ప్రాసెసింగ్ ప్రక్రియలో వచ్చే లాభనష్టాలతో పాటు సమగ్ర ఆర్థిక విశ్లేషణను అందిస్తుంది. ఈ రిపోర్టులో ప్లాంట్ వ్యవస్థాపకులతో పాటు వాటాదారులు కూడా తమ నిర్ణయాలను తెలియజేసి... చిరుధాన్యాలను ఉత్పత్తి చేసే యూనిట్ ను విజయవంతంగా నిర్వహించవచ్చు. అంతేకాదు దీని కోసం కస్టమైజేషన్ కూడా అందుబాటులో ఉందని తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రాంతం, ప్లాంట్ సామర్థ్యం మరియు యంత్రాలను సమకూర్చే జాబితా ఉండనున్నాయి.

మిల్లెట్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇవి గ్లూటెన్ ఫ్రీ ధాన్యం. వేల సంవత్సరాలుగా అనేక సంస్కృతుల్లో చిరుధాన్యాలు సంప్రదాయ ఆహారంగా ఉంది. పురాతన కాలానికి చెందిన ఈ మిల్లెట్స్ లో అధిక ప్రోటీన్ కంటెంట్, శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు ఫాస్పరస్, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. ప్రస్తుతం వీటిని బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెరుగైన జీర్ణక్రియను అందించడం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడటంలో మిల్లెట్స్ ప్రసిద్ధి చెందాయి. అలాగే ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

ప్రస్తుతం.. మిల్లెట్స్ పై రోజురోజుకు అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ లో చిరుధాన్యాలకు డిమాండ్ సైతం పెరుగుతోంది. ఇప్పటికే చిరుధాన్యాల పోషక ప్రయోజనాలను వివరిస్తూ.. ప్రభుత్వం అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ప్రజలు మిల్లెట్స్ ను తమ రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నారు. దాంతోపాటుగా ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం కోసం మిల్లెట్స్ తో తయారు చేసిన పదార్థాలను తీసుకుంటున్నారు. 

ఆరోగ్య మరియు పోషకాహార నిపుణులతో మిల్లెట్స్ ను ప్రొత్సహించే దిశగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్ లో మిల్లెట్స్ ఆధారిత ఉత్పత్తులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మరోవైపు మిల్లెట్స్ ను సాగు చేసేందుకు సేంద్రీయ మరియు పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులపై  రైతులు సైతం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. దీని ఫలితంగా రానున్న కాలంలో మిల్లెట్స్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 


© 2023 - 2025 Millets News. All rights reserved.