వంద మందిలో దాదాపు 20 నుండి 30 మంది వ్యక్తులు ఎదుర్కొనే సమస్య మైగ్రైన్. ఇది సాధారణ సమస్యగా అనిపించినా కూడా నిజానికి ఇది చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్యతో బాధ పడేవారు తరచుగా పెయిన్ కిల్లర్ లు వాడడం లేదా అతిగా టీ లేదా కాఫీ లాంటి పానీయాలను తాగడం చేస్తూ ఉంటారు. ఈ అలవాట్ల వలన తాత్కాలికంగా మైగ్రైన్ తలనొప్పి నుండి కొంచెం ఉపశమనం లభించినా కూడా దీర్ఘ కాలంగా ఇలా చేస్తే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. మరి సహజ సిద్ధంగా మైగ్రైన్ తగ్గించే మార్గాల కోసం వెతుకుతున్నారా? అయితే మీ సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది.
చిరు ధాన్యాలు మైగ్రైన్ ను తగ్గిస్తాయి
అవును అండి మీరు చదువుతున్నది నిజమే, మిల్లెట్స్ (Millets) మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మైగ్రైన్ సమస్య ను దూరం చేయవచ్చు. సాధారణంగా చాలా మందికి శరీరంలో మెగ్నీషయం లోపం ఉండడం వలన మైగ్రైన్ సమస్య ( Migraine) తలెత్తుతుంది. అయితే మిల్లెట్స్ లో అధికంగా మెగ్నీషియం ఉండడం వలన శరీరంలో రక్త ప్రసరణ బాగుండేలా చూసుకుంటుంది. దీని వలన మైగ్రైన్ నుండి చాలా వరకూ ఉపశమనం లభిస్తుంది. కొర్రలు, ఊదలు, అరికెలు , రాగులు ముఖ్యంగా ఈ నాలుగు రకాల చిరు ధాన్యాలను రోజుకు ఒకసారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిని ప్రతీరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మైగ్రైన్ తగ్గడమే కాకుండా భవిష్యత్తు లో మైగ్రైన్ రాకుండా కూడా ఉంటుంది.
మిల్లెట్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
మిల్లెట్స్ అధికంగా ఫైబర్ మరియు ప్రోటీన్ కలిగి ఉంటాయి, వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అందరికి ఒకే రకమైన మిల్లెట్స్ ప్రభావం చూపిస్తాయి అని చెప్పలేము. శరీర తత్వాన్ని బట్టి ఆరోగ్య సమస్యలను మిల్లెట్ లను ఎంచుకోవడం అవసరం. అలాగే మిల్లెట్ లను ఒకేసారి ఎక్కువ మోతాదు లో కాకుండా ప్రతీరోజూ నిర్దిష్ట మోతాదులో తీసుకోవడం మంచిది. ప్రత్యేకంగా మిల్లెట్స్ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేకపోయినా వాటిని శరీరానికి అలవాటు చేసే వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
మిల్లెట్స్ ఆహారంలో భాగంగా ఎలా తీసుకోవాలి ?
చాలా మంది మిల్లెట్స్ ను ఎలా తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, మిల్లెట్స్ తో వంట ఎలా చేయాలి తెలియడం లేదు. అయితే వీటితో చాలా వంటకాలు చేసుకోవచ్చు, రాగి ఇడ్లీ( Ragi Idly), రాగి దోస, అరికెల తో కిచిడి, కొర్రల ఉప్మా ఇలాంటివి అన్నీ ఇంట్లోనే మాములు వంట చేసుకున్నట్టే చేసుకోవచ్చు. వీటికి తగినన్ని తాజా కూరగాయలు కలిపి మనకి కావాల్సిన రుచికి తగినట్టుగా చేసుకోవచ్చు. రాగి తో చేసిన జావ లాంటివి అయితే ఉదయం అల్పాహారం కింద కూడా తీసుకోవచ్చు. వీటి వలన త్వరగా ఆకలి వేయదు. ఊబకాయం లాంటి సమస్యలకు కూడా మిల్లెట్స్ చాలా ఉపయోగపడతాయి.
© 2023 - 2024 Millets News. All rights reserved.