మిల్లెట్స్ పొంగనాలు.. టేస్ట్ తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు

మిల్లెట్స్ పొంగనాలు.. టేస్ట్ తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు

మిల్లెట్స్ పొంగనాలు.. టేస్ట్ తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు

 

చిరుధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్ వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజూ మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్యపరంగా ఎదురయ్యే చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వీటితో ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు దోశ, ఇడ్లీ, ఉప్మా మరియు పొంగనాలు వంటి వంటకాలు. అయితే క్రిస్పీగా, టేస్టీగా తినాలి అనుకునే ఆహార ప్రియులకు మిల్లెట్స్ పొంగనాలు మంచి ఎంపికని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మిల్లెట్స్ పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

మిల్లెట్స్ - ఒక కప్పు

మినపప్పు - పావు కప్పు

ఉల్లిపాయ - ఒకటి 

పచ్చిమిర్చి - ఒకటి లేదా రెండు

కొత్తిమీర - ఒక కట్ట

కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు

అల్లం ముక్క - చిన్నది

వెల్లుల్లి - ఐదు రెబ్బలు

కరివేపాకు - ఒక రెమ్మ

ఉప్పు - తగినంత

తయారీ విధానం:

పొంగనాలు తయారు చేసుకోవాలనుకునే వారు ముందు మిల్లెట్స్ ను కనీసం ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత మిల్లెట్స్ శుభ్రంగా కడిగి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పిండిలో తగినంత ఉప్పు, టీ స్పూన్ సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాళింపు కోసం చిన్న కడాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో కాస్త నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రోస్ట్ చేయాలి. అందులో కొబ్బరి తురుముతో పాటు కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

తరువాత పొంగనాల పాన్ తీసుకుని ఆ గుంతల్లో కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటూ గుంతలు నింపుకోవాలి. పాన్ ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాలు పాటు ఉడకనివ్వాలి. తరువాత పొంగనాలను తిరిగవేసి కాస్త రోస్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. అంతే వేడి వేడి మరియు టేస్టీ మిల్లెట్స్ పొంగనాలు రెడీ. వీటిని కొబ్బరి లేదా టోమాటో చట్నీతో కలిపి తీసుకోవచ్చు. 

 


© 2023 - 2025 Millets News. All rights reserved.